నేషనల్ హైవే బ్రిడ్జిపై నుంచి కిందపడిన లారీ
ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
Advertisement
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట నేషనల్ హైవే బ్రిడ్జిపై నుంచి లారీ కిందపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు బండలతో వెళ్తున్న ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులోకి రాగానే అదుపు బ్రిడ్జి పై నుంచి కిందికి దూసుకెళ్లింది. లారీ వేగానికి దాని వెనుక టైర్లు మొత్తం ఊడిపోయి లారీ బాడీ మొత్తం బ్రిడ్జి కింద కుప్పకూలింది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు మూడు గంటలు శ్రమించి క్రేన్ సహాయంతో ఆయనను రక్షించారు. హుటాహుటిన డ్రైవర్‌ను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Advertisement