బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో రైతు ఆత్మహత్యకు చేసుకున్నాడు

Advertisement
Update:2025-01-18 18:20 IST

ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు చేసుకున్నాడు. బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. పలు కారణాలతో అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు అధికారులు నిత్యం వేధింపులకు గురిచేసినట్లు బంధువులు చెబుతున్నారు. బ్యాంక్ ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పొలీసులు దర్యాప్తు చేపట్టి విచారణ చేస్తున్నారు. రైతు ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ అయితే ఈ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. ఈ రైతును చంపింది ముమ్మాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని హరీశ్‌రావు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News