రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్నినానిపై కేసు నమోదు
ఈ కేులో కొనసాగుతున్న అరెస్టులు
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను ఏ6గా చేరుస్తూ బందరు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. కేసు విచారణలో భాగంగా సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గోడౌన్ మేనేజర్ మానస తేజాను అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కోటిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బియ్యం మాయం అయినట్లు తనపై అనుమానం రాకుండా ముందుగానే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బొట్ల మంగారావులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నిందితులకు మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు.మచిలీపట్నం సబ్‌జైలుకు వారిని తరలించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించింది.