శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం
ఈ ఘటనలో ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
Advertisement
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45) గా గుర్తించారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 108 వాహనం మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తుండగా ఈప్రమాదం జరిగింది.
Advertisement