కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం 10 మంది మృతి

మీర్జాపూర్‌-ప్రయాగ్‌రాజ్‌ నేషనల్‌ హైవేపై ఈ ఘటన.. మరో 19 మందికి తీవ్రగాయాలు

Advertisement
Update:2025-02-15 08:49 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌-ప్రయాగ్‌రాజ్‌ నేషనల్‌ హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన పలువురు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ జీపు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన భక్తులను తీసుకెళ్తున్న బస్సును ఢీకొట్టింది. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ఈ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News