ఆస్పత్రిలో చేరిన నటుడు పృథ్వీ రాజ్ ఎందుకో తెలుసా?
హైబీపీతో ఆసుపత్రిలో సినీనటుడు పృథ్వీ రాజ్ చేరాడు
సినీ నటుడు పృథ్వీ రాజ్ హైబీపీతో ఆసుపత్రిలో చేరారు. బీపీ ఒక్కసారి పెరగడంతో సన్నిహితులు ఆయనను మోతీనగర్‌లో ఓ హాస్పిటల్‌లో చేర్చారు. రెండు రోజుల క్రితం లైలా మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 150 మేకలు.. 11 మేకల కథ చెప్పారు.. వైసీపీని టార్గెట్ చేసి.. జగన్ ను దెప్పిపొడుస్తూ చేసిన ఈ వ్యాఖ్యలతో.. పొలిటికల్ వార్ నడుస్తుంది.
పృధ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పినా.. పృధ్వీనే క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ.. ఎక్స్ వేదికగా బాయ్‌కాట్ లైలా మూవీ పేరుతో టార్గెట్ చేసింది.ఈ వీడియోలో పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పృథ్వీ చేసిన కామెంట్స్ తో ‘‘బైకాట్ లైలా మూవీ’’ రెండ్రోజులు గడిచిన కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరో మూడు రోజుల్లో (ఫిబ్రవరి 14న) సినిమా విడుదల కానుంది.