Actor Vaibhav | వైభవ్ హీరోగా ఆలంబన

Actor Vaibhav Aalambana Movie - చాన్నాళ్ల తర్వాత మరోసారి తెలుగుతెరపైకి రాబోతున్నాడు నటుడు వైభవ్. ఇతడు నటించిన తాజా చిత్రం పేరు ఆలంబన.

Advertisement
Update:2023-11-05 19:20 IST

సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ నటించిన తాజా సినిమా 'ఆలంబన'. ఆయన సరసన పార్వతి నాయర్ హీరోయిన్ గా నటించింది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించాడు. పారి కె విజయ్ దర్శకత్వం వహించారు. కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

'ఆలంబన' కథ విషయానికి వస్తే... హీరో అపర కుబేరుల ఇంట్లో జన్మిస్తాడు. కానీ, దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబం ఆస్తి అంతటినీ కోల్పోతుంది. రాజభవనం లాంటి ఇంటి నుంచి నడిరోడ్డు మీదకు కట్టు బట్టలతో వచ్చేస్తారు. అటువంటి పరిస్థితులో ఓ శుభ ముహూర్తంలో హీరో జీవితంలోకి జీని అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనకు ఎదురైన పరిస్థితులను జీనీ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? అనేది వెండితెరపై చూడాలి.

ప్రేక్షకులకు వినోదం అందించే చిత్రమిది. హీరోకి, వాళ్ళ కుటుంబానికి ఎదురయ్యే పరిస్థితులు కడుపుబ్బా నవ్విస్తాయి. వినోదంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ కూడా ఉందని.. . హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు మేకర్స్.

వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ, మునీష్ కాంత్, పాండియరాజన్, కబీర్ సింగ్, కాళీ వెంకట్, రోబో శంకర్ కీలక పాత్రలు పోషించారు. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

Tags:    
Advertisement

Similar News