చిన్న వీడియోతో పెద్ద ప్రభంజనం యూట్యూబ్ షార్ట్స్
మూడేళ్ల క్రితం షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టిన యూట్యూబ్ …ఇప్పుడు దానిని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మనిషి జీవితంలో యూట్యూబ్ ఓ ప్రధాన భాగమైపోయింది. ఇందులో డౌటే లేదు.. ఇంక షార్ట్స్ వచ్చాక స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజులో గంట సేపు అయినా షార్ట్స్ చూడకుండా ఉండటం లేదన్నది అతిశయోక్తి కాదు.
మూడేళ్ల క్రితం షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టిన యూట్యూబ్ … ఇప్పుడు దానిని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2022 ఏడాదిలో షార్ట్స్‌ను రోజూ అప్‌లోడ్ చేస్తున్న ఛానెల్‌ల సంఖ్య 80 శాతం పెరిగింది. ప్రస్తుతం షార్ట్స్‌ను ప్రతి నెలా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మంది వినియోగిస్తున్నారు.
2020లో టిక్‌టాక్ యాప్‌ని నిషేధించిన తర్వాత భారత్‌లో యూట్యూబ్ షార్ట్స్ దశ తిరిగిపోయింది. నాటికి 8 బిలియన్ డాలర్ల నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు మానిటైజేషన్ అవకాశం ఉందని యూట్యూబ్ అంచనా వేస్తోంది. వీడియోలకు షార్ట్స్ సరికొత్త రూపాన్ని ఇస్తున్నాయని, సైన్స్, జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతోందని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ తెలిపారు. పెరుగుతున్న మొబైల్ వీక్షకులను ఆకట్టుకునేందుకు యూట్యూబ్ షార్ట్స్ చాలా ప్రభావవంతంగా పని చేస్తున్నాయని.. అందుకే భారత్‌లోనూ ఈ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేశామని ఛటర్జీ చెప్పారు.
వీక్షకులకు మరింత అందుబాటులో ఉండేలా షార్ట్స్‌లో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నామని ఛటర్జీ వెల్లడించారు. షార్ట్స్‌తో తదుపరి తరం మొబైల్ క్రియేటర్‌లకు మద్దతునిస్తూనే ఉన్నామని, ఇది కొత్త క్రియేటర్‌లను, కొత్త ప్రేక్షకులను యూట్యూబ్‌కి తీసుకొస్తోందని ధీమా వ్యక్తం చేశారు.