హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...అద్భుతమైన ఫీచర్లు
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి హోండా మోటార్స్ శుభ వార్త చెప్పింది. హోండా యాక్టివా ఈ, క్యూసీ 1 పేరిట రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ సరికొత్త వాహనలను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఈవీ స్కూటర్లను ఇవాళ ప్రదర్శించారు.హోండా యాక్టివా ఈవీ.. రెగ్యులర్ యాక్టివా మోడల్ కంటే కొంచెం భిన్నంగా ఉంది. ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌తో పాటు సైడ్ ఇండికేటర్ల విషయంలో స్వల్ప మార్పులు చేశారు. ఇది స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో రెండు 1.5 కిలోవాట అవర్ బ్యాటరీలను అమర్చారు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
గరిష్టంగా గంటకు 80 మీటర్ల స్పీడ్‌తో వెళ్లవచ్చు. స్టాండర్డ్, స్పోర్ట్స్, ఎకానమీ మోడ్‌లలో హోండా యాక్టివా ఈవీ అందుబాటులోకి రానుంది.హోండా క్యూసీ 1ను తక్కువ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. ఇది 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ చార్జ్‌తో 80కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఈ రెండు ఈవీ స్కూటర్లకు సంబంధించిన రేటు మాత్రం ఇంకా ప్రకటించలేదు. కాకపోతే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వీటి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అప్పుడే ప్రైస్ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.