రెన్యూమరేషన్ లోనూ 'పుష్ప' ది గ్రేట్!
పుష్పా 2 సినిమాకు రూ.300 కోట్ల పారితోషకం తీసుకున్నాడని వెల్లడించిన ఫోర్బ్స్
రెన్యూమరేషన్ లోనూ అల్లు అర్జున్ పుష్ప ది గ్రేట్ అనిపించుకున్నారు. ఇండియాలోనే ఒక సినిమాకు హయ్యెస్ట్ రెన్యూమరేషన్ తీసుకున్న హీరోగా కొత్త చరిత్ర సృష్టించారు. అల్లు అర్జున్ 'పుష్ప 2.. పుష్ప ది రూల్' సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల పారితోషకం తీసుకున్నాడని ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ వెల్లడించింది. పుష్ప సినిమాలో తన అద్భుత నటనకు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ హీరోలను మించిన క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ 2024లో హయ్యెస్ట్ రెన్యూమరేషన్ తీసుకున్న టాప్ టెన్ నటుల జాబితా విడుదల చేసింది. తమిళ హీరో విజయ్ రూ.275 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. త్వరలో రాబోయే విజయ్ 69 సినిమాకు ఆయన ఈ పారితోషం తీసుకన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో షారూక్ ఖాన్ రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్లు, రజనీకాంత్ రూ.150 కోట్ల నుంచి రూ.270 కోట్లు, అమీర్ ఖాన్ రూ.100 కోట్ల నుంచి రూ.275 కోట్లు, ప్రభాస్ రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లు, అజిత్ రూ.105 కోట్ల నుంచి రూ.165 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు, కమల్ హసన్ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు, అక్షయ్ కుమార్ రూ.60 కోట్ల నుంచి 145 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న టాప్ టెన్ నటుల్లో ఆరుగురు దక్షిణాదికి చెందిన వారే కాగా.. నలుగురు మాత్రమే బాలీవుడ్ హీరోలు ఉన్నారు.