Ola Electric | స్ప్లెండ‌ర్..యాక్టీవాల కంటే ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ చౌక‌..

Ola Electric | దేశంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric).. త‌న ఓలా ఎస్‌1 ఎక్స్ (Ola S1 X) స్కూట‌ర్ల ధ‌ర భారీగా త‌గ్గించింది.

Advertisement
Update:2024-04-18 12:11 IST

Ola Electric | దేశంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric).. త‌న ఓలా ఎస్‌1 ఎక్స్ (Ola S1 X) స్కూట‌ర్ల ధ‌ర భారీగా త‌గ్గించింది. ఓలా ఎస్‌1 ఎక్స్ (Ola S1 X) స్కూట‌ర్ ధ‌ర రూ.69,999 నుంచి ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. దేశంలో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ) మోడ‌ల్ టూ వీల‌ర్స్ హీరో స్ప్లెండ‌ర్‌+ (Hero Splendor +), హోండా యాక్టీవా (Honda Activa) ల క‌న్నా చౌక ధ‌ర.

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) టూ వీల‌ర్స్‌లో మూడు ఎస్‌1ఎక్స్‌ (S1 X) వేరియంట్లు - ఎస్‌1ఎక్స్ 2కిలోవాట్లు (S1 X 2kWh), ఎస్‌1ఎక్స్ 3కిలోవాట్స్ (S1 X 3kWh), ఎస్‌1ఎక్స్ 4 కిలోవాట్స్ (S1 X 4kWh) మోడ‌ల్ స్కూట‌ర్ల‌లో అత్యంత చౌక ధ‌ర‌కు ఎస్‌1ఎక్స్ 2కిలోవాట్స్ (S1 X S1 X 2kWh) స్కూట‌ర్ ల‌భిస్తుంది. ఎస్‌1ఎక్స్ 2 కిలోవాట్స్ (S1 X 2kWh) స్కూట‌ర్ ధ‌ర రూ.69,999 (ఎక్స్ షోరూమ్‌), ఎస్‌1ఎక్స్ 3కిలోవాట్స్ (S1 X 3kWh) ధ‌ర రూ.84,999 (ఎక్స్ షోరూమ్‌), ఎస్‌1 ఎక్స్ 4కిలోవాట్స్ (S1 X 4kWh) రూ.99,999 ప‌లుకుతుంది. ఓలా ఎల‌క్ట్రిక్ త‌న ఎస్‌1ఎక్స్ రెండో కిలోవాట్స్ (S1 X 2kWh), ఎస్1ఎక్స్ 4కిలోవాట్స్ (S1 X 4kWh) మోడ‌ల్ స్కూట‌ర్ల ధ‌ర‌లు రూ.10,000, ఎస్‌1ఎక్స్ 3 కిలోవాట్స్ (S1 X 3kWh) స్కూట‌ర్ ధ‌ర రూ.5,000 త‌గ్గించింది.

దేశంలోనే అతి పెద్ద టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ హీరో మోటార్స్ సైకిల్స్ విక్ర‌యిస్తున్న హీరో స్ప్లెండ‌ర్+ (Hero Splendor +) మోటారు సైకిల్ ధ‌ర రూ.75,441 (ఎక్స్ షోరూమ్‌), హోండా యాక్టీవా (Honda Activa) స్కూట‌ర్ రూ.76,234 (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. మాస్ టూ వీల‌ర్స్ సెగ్మెంట్‌లోకి ఓలా త‌న ఎస్‌1ఎక్స్ (Ola S1 X) స్కూట‌ర్ డెలివ‌రీలు వ‌చ్చేవారం ప్రారంభిస్తుంది.

మొత్తం ఓలా స్కూట‌ర్ల‌లో ఓలా ఎస్‌1 ఎక్స్ 2 కిలోవాట్స్ (Ola S1 X 2kWh) అత్యంత చౌక ధ‌ర‌కు ల‌భిస్తుంది. 6కిలోవాట్ల హ‌బ్ మోటార్ విత్ 2కిలోవాట్స్ బ్యాట‌రీతో రూపుదిద్దుకున్న‌ది. మూడు డ్రైవ్ మోడ్స్‌- ఎకో, నార్మ‌ల్‌, స్పోర్ట్స్ మోడ్స్‌లో ల‌భిస్తుంది. సింగిల్ ఫుల్ చార్జింగ్ చేస్తే 95 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. ట్రూ రేంజ్‌- ఎకో మోడ్‌లో 84 కిమీ, నార్మ‌ల్ మోడ్‌లో 71 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది.

ఓలా ఎస్‌1 ఎక్స్ 2 కిలోవాట్స్ (Ola S1 X 2kWh) స్కూట‌ర్ గ‌రిష్టంగా 85 కిమీ దూరం ప్ర‌యాణిస్తుంది. 4.1 సెక‌న్ల‌లో 40 కి.మీ, 8.1 సెక‌న్ల‌లో 60 కి.మీ స్పీడ్‌తో వెళుతుంది. హోం చార్జ‌ర్‌తో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ బ్యాట‌రీ ఐదు గంట‌ల్లో చార్జింగ్ అవుతుంది. ఓలా ఎస్‌1ఎక్స్ 2కిలోవాట్స్ (Ola S1 X 2kWh) స్కూట‌ర్ ఎల్ఈడీ లైట్స్‌, 4.3-అంగుళాల ఎల్‌సీడీ ఐపీ, ఫిజిక‌ల్ కీ, క్రూయిజ్ కంట్రోల్‌, టెలిస్కోపిక్ ఫ్రంట్ స‌స్పెన్ష‌న్‌, రేర్ డ్యుయ‌ల్ షాక్స్‌, ఫ్రంట్ అండ్ రేర్ డ్ర‌మ్ బ్రేక్స్‌, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్ట‌మ్‌, సైడ్ స్టాండ్ అల‌ర్ట్‌, రివ‌ర్స్ మోడ్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి.



ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌లు ఇలా..

ఎస్1 ఎక్స్ 2కిలోవాట్స్ (S1 X 2kWh) : రూ.69,999

ఎస్1 ఎక్స్ 3కిలోవాట్స్ (S1 X 3kWh) : రూ. 84,999

ఎస్1 ఎక్స్ 4కిలోవాట్స్ (S1 X 4kWh) : రూ. 99,999

ఎస్‌1 ఎక్స్+ (S1 X+) : రూ.84,999

ఎస్‌1 ఎయిర్ (S1 Air) : రూ.1,04,999

ఎస్‌1 ప్రో (S1 Pro) : రూ. 1,29,999

ఓలా ఎస్‌1 ఎక్స్ 2 కిలోవాట్స్ (Ola S1 X 2kWh) నుంచి ఎస్ ప్రో వ‌ర‌కూ అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై ఎనిమిదేండ్లు లేదా 80 వేల కి.మీ మేర‌కు బ్యాట‌రీ వారంటీ ఉంటుంది. అద‌నంగా రూ.4,999 చెల్లిస్తే 1.25 ల‌క్ష‌ల కి.మీ దూరం వ‌ర‌కూ అద‌న‌పు వారంటీ అందిస్తుంది. రూ.29,999తో ఓలా 3కిలోవాట్ల పోర్ట‌బుల్ ఫాస్ట్ చార్జ‌ర్ అంద‌జేస్తుంది. 2022-23లో మొత్తం 7,28,205 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు విక్ర‌యిస్తే, 2023-24లో 9,47,087 యూనిట్లు విక్ర‌యించింది. 2022-23తో పోలిస్తే గ‌త ఆర్థిక సంవ్స‌రంలో 30.06 శాతం వృద్ధి న‌మోదైంది. వాటిల్లో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల వాటా 1,52,791 యూనిట్ల నుంచి 3,29,237 యూనిట్ల‌కు పెరిగింది. 2022-23తో పోలిస్తే గ‌తేడాది సేల్స్‌లో మార్కెట్లో ఓలా సేల్స్‌ 34.76 శాతం న‌మోదైంది.

Tags:    
Advertisement

Similar News