ఓలా స్కూటర్లపై భారీగా తగ్గింపు ఎంతంటే?
ఓలా ఎలక్ట్రిక్ హోలీ సందర్బంగా ప్రత్యేక సేల్ ప్రకటించింది.;
ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ హోలీ సందర్బంగా ప్రత్యేక సేల్ ప్రకటించింది.ఈ సేల్ మార్చి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. సేల్‌లో భాగంగా ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ.26,750 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈవీ ధర రూ.89,999గా ఉంది. ఓలా ఎక్స్+ జెన్2 (S1 X+ Gen 2)పై రూ.22 వేల వరకు రాయితీ అందించనన్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఈ స్కూటీ ధర రూ.82,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఎస్1 రేంజ్‌లోని మిగిలిన స్కూటర్లపై రూ.25 వేల వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్లోకి కొత్తగా తీసుకొచ్చిన ఎస్1 జెన్3 శ్రేణి ఈవీలకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిస్కౌంట్‌తో పాటు రూ.10,500 విలువైన ప్రయోజనాలను ఓలా ఎలక్ట్రిక్ అందిస్తోంది. నూతనంగా ఎస్1 జెన్2 స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఏడాది పాటు రూ.2,999 విలువైన మూవ్ ఓఎస్+ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తోంది.