టారిఫ్‌ల తగ్గింపు ట్రంప్‌ ఒత్తిడితో కాదు

భారత వాణిజ్యశాఖ ఉన్నతాధికారుల వెల్లడి;

Advertisement
Update:2025-03-09 12:23 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడితో సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోలేదని భారత వాణిజ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికే గణనీయంగా సుంకాలను భారత్‌ తగ్గిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాల ద్వారా ఆస్ట్రేలియా, యూఏఈ, స్విర్జర్లాండ్‌, నార్వే వంటి దేశాలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు గుర్తుచేశారు. ఐరోపా సమాఖ్య సహా బ్రిటన్‌ తో అలాంటి దిశగా చర్చలు జరుగుతున్నట్లు వివరించారు. అలాంటి కోణంలోనే అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించినట్లు పరిగణించాలని, ట్రంప్‌ ఒత్తిడితో కాదని అధికారులు తెలిపారు. వ్యవసాయం మినహా దాదాపు అన్ని అమెరికా ఎగుమతులపై సుంకాలను తొలిగించాలని అమెరికా భారత్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య 118. 2 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది.  

Tags:    
Advertisement

Similar News