కెనడా, మెక్సికోలపై టారిఫ్‌ల అమలు మరోసారి వాయిదా
ఒక నెల వాయిదా వేస్తున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేసిన ట్రంప్;
కెనడా, మెక్సికోల వస్తువులపై సుంకాల పెంపు అమలును మరో నెల వాయిదా వేస్టున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ అంశంపై మొదటి మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తో ట్రంప్ చర్చలు జరిపారు. తర్వాత మెక్సికోకు చెందిన వస్తువులపై 25 శాతం టారిఫ్‌లను ఒక నెల వాయిదా వేస్తున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. అనంతరం కెనడా వస్తువులపై కూడా సుంకాల విధింపును మరో నెలరోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని వాణిజ్య మంత్రిహోవార్డ్ లుట్నిక్ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. కెనడా, మెక్సికోలపై సుంకాల అమలు వాయిదా వేయడం ఇది రెండోసారి. మరోవైపు ట్రంప్ సర్కార్ సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో చర్చలు నిర్మా ణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల మధ్య భవిష్యత్తులో వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. సుంకాల అమలును నెలరోజులు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అమెరికా దిగుమతులపై ప్రతికార సుంకాలు విధించే ప్రణాళికలో మార్పులేదన్నారు.