లాభాల్లో స్టాక్ మార్కెట్లు
నిన్నటితో పోల్చితే కాస్త బలపడిన రూపాయి
Advertisement
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీతో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఉదయం 80,529.20 పాయింట్ల వద్ద ప్రారంభమైన ట్రేడింగ్ మధ్యాహ్నానికి 80,949.10 పాయింట్లకు చేరుకుంది. 597.67 పాయింట్ల లాభంతో బీఎస్‌ఈలో ట్రేడింగ్ కొనసాగింది. నిఫ్టీ 181 పాయింట్లు లాభపడి 24,457 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారంతో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త బలపడింది. సుమారు ఆరు పైసలు రూపాయి బలపడి 84.69 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాలు ఆర్జించాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్ర, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. బ్యారెల్ క్రూడయిల్ ధర 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Advertisement