ఒక్క రోజులో రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఢమాల్‌

Advertisement
Update:2025-01-06 19:54 IST

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడితో సూచీలు నేల చూపులు చూశాయి. దీంతో ఒక్క రోజులోనే రూ.12 లక్షల కోట్ల ప్రజల సంపద ఆవిరి అయ్యింది. సోమవారం ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీతో పాటు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఒకానొక దశలో 1,400 పాయింట్లు పడిపోగా చివరికి కాస్త కోలుకొని 1,258.12 పాయింట్లు నష్టపోయి 77,964.99 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 388.70 పాయింట్లు నష్టపోయి 23,550 పాయింట్ల వద్ద ముగిసింది. బెంగళూరులో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ గా నిర్దారణ కావడంతో దేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయోననే ఆందోళనతో తమ షేర్లు విక్రయించేందుకు ఎక్కువ మంది పోటీ పడ్డారు. దీంతో మార్కెట్లు క్రాష్‌ అయ్యాయి. టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి.

Tags:    
Advertisement

Similar News