లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 226 పాయింట్లు.. నిఫ్టీ 63 పాయింట్ల లాభం
ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి మిక్సుడ్ ఫలితాలు వస్తున్నా దేశీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకాకుండా కాస్త లాభాల్లోనే కొనసాగాయి. శుక్రవారం ఉదయం 78,607.62 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 79,043.15 పాయింట్ల గరిష్టానికి చేరింది.. చివరికి 78,699.07 పాయింట్ల వద్ద ముగిసి 226.59 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 63.20 పాయింట్లు లాభపడి 23,813.40 పాయింట్ల వద్ద ముగిసింది. మహీంద్ర అండ్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాన్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్ షేర్లు లాభాలు దక్కించుకున్నాయి. టాటా స్టీల్స్, అదానీ పోర్ట్స్, జొమాటో, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ ఇంకో 25 పైసలు క్షీణించి 85.52 వద్ద ట్రేడవుతోంది.