రూ.10 వేలకు పైగా డిస్కౌంట్‌తో వన్ ప్లస్ 12!
రెండు వారాల్లోనే ఇండియన్ మార్కెట్‌లోకి వన్ ప్లస్ 13 ఎంట్రీ
వన్ ప్లస్ లవర్స్ కు గుడ్ న్యూస్. వన్ ప్లస్ 12 ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పైగా డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఈ సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. 12 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.64,999 కాగా అమెజాన్ ఈ మొబైల్ పై 8 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ.5 వేలు తక్కువగా ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్‌తో కొనుగోలు చేసే వాళ్లు అదనంగా ఇంకో రూ.7 వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐల ద్వారా మొబైల్ కొనేవారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అంటే రూ.52,999లకే మొబైల్ మీ పాకెట్లోకి చేరుతుంది. ఈ ఫోన్ 6.82 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీవో 4.0 అమోలెడ్ డిస్‌ప్లే చూడముచ్చటగా డిజైన్ చేశారు. 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 4,500 పీక్ బ్రైట్ నెట్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14తో ఈ మొబైల్ పనిచేస్తుంది. 50 మెగాపిక్సల్, 48 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్, 64 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫొటో జూమ్ లెన్స్, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో ఉన్న మొబైల్‌లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది 100 వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మరో రెండు వారాల్లో వన్ ప్లస్ 13 ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలోనే వన్ ప్లస్ 12పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు.