జియో వినియోగదారులకు బిగ్ షాక్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో యూజర్లకు షాకిచ్చింది.

Advertisement
Update:2024-12-27 20:00 IST

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. డైలీ డేటా అయిపోయినప్పుడు వినియోగించే రూ.19 రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని తగ్గించింది. ఇప్పటి వరుకు ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ వోచర్ వ్యాలిడిటీ ఉండేది. కానీ రూ.19తో రీఛార్జ్ చేస్తే 1జీబీ డేటా, రూ.29 ప్లాన్‌తో 2జీబీ డేటా ఇస్తోంది. ప్రస్తుతం కస్టమర్లు వేసుకున్న నెల మూడు నెలలు ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్ల వ్యాలిడిటీ ఉండేది.

తాజాగా జియో ఈ డేటా వోచర్ల వ్యాలిడిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 19 ప్లాన్ ను ఒక రోజుకు, రూ. 29 ప్లాన్ ను రెండు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా జియో తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు మండిపడుతున్నారు. జియో రోజురోజుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లకు చేరువవుతోందని, వాటితో పోల్చుకుంటే నెట్‌వర్క్ మినహా పెద్దగా తేడా లేదని 'ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం యూజర్లకు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చును.

Tags:    
Advertisement

Similar News