నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య అప్రమత్తంగా వ్యవహరిస్తున్న మదుపర్లు

Advertisement
Update:2024-12-18 10:28 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య మదుపర్లు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు ఆటో, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,300 పాయింట్ల కింద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 245.13 పాయింట్లు తగ్గి 80,439.45 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 74.20 పాయింట్లు కుంగి 24,261.15 వద్ద కొనసాగుతున్నది. మరోవైపు నేడు వెలువడే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల ప్రకటన కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.92 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73.21 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,660.90 వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News