స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌.. రూ.9 లక్షల కోట్లు ఉఫ్‌

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Advertisement
Update:2024-12-20 16:43 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌ అయ్యాయి.. శుక్రవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి అయ్యింది. ఈ వారంలో వరుసగా ఐదో భారీ నష్టాల్లోనే స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ముగిసింది. ఇంటర్నేషన్‌ మార్కెట్ల ప్రతికూలత, విదేశీ ఇన్వెస్టర్లు తమ స్టాక్‌ అమ్ముకోవడానికి పోటీ పడటంతో మార్కెట్లు నష్టాల బాటలోనే సాగాయి. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లు కోల్పోయి రూ.441 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 79,218.05 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన ఒకానొక దశలో 77,874.59 పడిపోయింది. చివరికి 1,176.46 పాయింట్లు కోల్పోయి 78,041.59 పాయింట్ల వద్ద ముగిసింది. నిష్టీ 375.05 పాయింట్లు కోల్పోయి 23,576.65 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.03 వద్ద ముగిసింది. మహీంద్ర అండ్‌ మహీంద్ర, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్ర, టాటా మోటార్స్‌ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నెస్లే ఇండియా, టైటాన్‌ షేర్లు మాత్రమే స్వల్ప లాభాలు దక్కించకున్నాయి.

Tags:    
Advertisement

Similar News