ఆ వీడియోలు నమ్మొద్దు

పెద్ద ఎత్తున రిటర్న్స్‌ అనే దానిపై కస్టమర్లను అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

Advertisement
Update:2024-12-17 14:55 IST

పెద్ద ఎత్తున రిటర్నులు.. అంటూ స్టేట్‌ బ్యాంక్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ స్పందించింది. ఇవన్నీ కేవలం నకిలీ వీడియోలు అంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్‌ విడుదల చేసింది.

బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తులంటూ సోషల్‌ మీడియాలో చక్లర్లు కొడుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు నమ్మవద్దు. ఆ వీడియోలో పేర్కొన్న పథకాలతో బ్యాంక్‌కు గాని, బ్యాంక్‌ అధికారులకు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలో ఫలానా పథకంలో పెట్టుబడి పెట్టండంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ఇలాంటి అవాస్తవమైన, అసాధారణ రాబడి ఇచ్చే వాగ్దానాలు ఎస్‌బీఐ చేయదు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది.

Tags:    
Advertisement

Similar News