ఫోర్టిఫైడ్‌ రైస్‌ పై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు

ఇన్సూరెన్స్‌ మినహాయింపులపై నిర్ణయం వాయిదా

Advertisement
Update:2024-12-21 20:26 IST

ఫోర్టిఫైడ్‌ బియ్యంపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జైసల్మేర్‌లో శనివారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక నిర్ణయాలేవి తీసుకోలేదు. లైఫ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. జన్యు పరమైన చికిత్సలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. రుణాలు తీసుకున్న వారిపై బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు విధించే పెనాల్టీపై జీఎస్టీని తొలగించారు. రూ.2 వేల లోపు పేమెంట్లు చేసే అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపునిచ్చారు. స్విగ్గీ, జోమాటో లాంటి ఫుడ్‌ డెలవరి ప్లాట్‌ఫామ్‌లపై జీఎస్టీ స్లాబ్‌లపైనా నిర్ణయం తీసుకోలేదు.

Tags:    
Advertisement

Similar News