ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్! ఫీచర్లివే..
ఓలా ఎలక్ట్రిక్ నుంచి ‘రోడ్‌స్టర్’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో ఓలా స్కూటర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో ఎక్కువ అమ్ముడవుతున్న ఈవీ బ్రాండ్‌ల్లో ఓలా ముందువరుసలో ఉంది. అయితే ఇప్పుడీ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి ‘రోడ్‌స్టర్’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ కనిపిస్తుండడంతో ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా తీసుకొచ్చింది ఓలా. ఇందులో రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో అను మూడు వేరియంట్లు ఉన్నాయి.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌లో మూడు బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. 2.5కిలో వాట్ బైక్ ధర రూ.74,999, 3.5కిలో వాట్ బైక్ ధర రూ.85,999 , 4.5కిలో వాట్ బైక్ ధర రూ.99,999. ఇవి సింగిల్ ఛార్జ్‌తో 150 నుంచి 200 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తాయి. టాప్ స్పీడ్ 124 కిలోమీటర్లు ఉంటుంది. 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది.
ఓలా రోడ్‌స్టర్‌లో కూడా మూడు బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. 3.5కిలో వాట్ ధర రూ.1.04 లక్షలు, 4.5కిలోవాట్ ధర రూ.1,19,999, 6 కిలోవాట్ ధర రూ.1,39,999. ఈ బైక్ టాప్ స్పీడ్ 126 కిలోమీటర్లు ఉంటుంది. 150 నుంచి 250 కిలోమీటర్లు రేంజ్ ఇస్తాయి. 6.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది.
ఇక రోడ్‌స్టర్ ప్రో విషయానికొస్తే ఇందులో 9 కిలోవాట్ ధర రూ.1.99 లక్షలు, 16 కిలో వాట్ ధర రూ.2.49 లక్షలుగా ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 194 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఇందులో10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది.