పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు (28-12-2022) బంగారం ధరలు తగ్గలేదు కానీ..
ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. నేటి ఉదయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ బులియన్ మార్కెట్‌లో రూ.49,950గా ఉంది.
బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన పసిడి కాస్త శాంతించింది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేథ్యంలోనే ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.. నేటి ఉదయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ బులియన్ మార్కెట్‌లో రూ.49,950గా ఉంది. ఇదే సమయంలో.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480గా ఉంది. అయితే బంగారం ధరతో పోలిస్తే.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి వెయ్యి రూపాయల మేర పెరిగింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి రూ.72,300 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,950.. రూ.54,480
విజయవాడలో రూ.49,950.. రూ.54,480
విశాఖపట్నంలో రూ.49,950 .. రూ.54,480
చెన్నైలో రూ.50,900.. రూ.55,520
కోల్‌కతాలో రూ.49,950.. రూ.54,480
బెంగళూరులో రూ.50,000.. రూ.54,510
కేరళలో రూ.49,950.. రూ.54,480
ఢిల్లీలో రూ.50,100.. రూ.54,630
ముంబైలో రూ.49,950.. రూ.54,480
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200
విజయవాడలో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200
బెంగళూరులో రూ.74,200
కేరళలో రూ.74,200
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,300
ముంబైలో కిలో వెండి ధర రూ.72,300