గోల్డ్ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించిన 360 వన్ అసెట్

తక్కువ వ్యయాలతో బంగారంలో సౌకర్యవంతంగా, సమర్ధవంతంగా పెట్టుబడులు పెట్టడంలో ఇన్వెస్టర్లకు ఈ ప్యాసివ్ ఫండ్ సహాయకారి

Advertisement
Update:2025-02-20 20:05 IST

న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ఫిబ్రవరి 20న ప్రారంభమై ఫిబ్రవరి 28న ముగియనున్నది . కనీస దరఖాస్తు మొత్తం రూ. 500 (ఆ తర్వాత నుంచి రూ. 1 గుణిజాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు). నిరంతర విక్రయ, కొనుగోలు లావాదేవీల కోసం తిరిగి 2025 మార్చి 10న స్కీం అందుబాటులోకి వస్తుంది. 360 వన్ గోల్డ్ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించినట్లు 360 వన్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్) (“360 ONE Asset”) ప్రకటించింది. ఇది దేశీయంగా బంగారం ధరలను ప్రతిఫలించేలా లేదా ట్రాక్ చేసే విధంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్). లిక్విడిటీ, పారదర్శకత, తక్కువ వ్యయాలతో బంగారంలో సౌకర్యవంతంగా, సమర్ధవంతంగా పెట్టుబడులు పెట్టడంలో ఇన్వెస్టర్లకు ఈ ప్యాసివ్ ఫండ్ సహాయకారిగా ఉంటుంది.

ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) 2025 ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుంది. కనీస దరఖాస్తు మొత్తం రూ. 500గా ( ఆ తర్వాత నుంచి రూ. 1 గుణిజాల్లో) ఉంటుంది. ఎన్‌ఎఫ్‌వో యూనిట్ ధర రూ. 10గా ఉంటుంది. దేశీయంగా బంగారం ధర కదలికలకు అనుగుణంగా ఉండేలా, 360 వన్ గోల్డ్ ఈటీఎఫ్ తన అసెట్స్‌లోని 95 శాతం భాగాన్ని పసిడి లేదా ఆ మెటల్ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లిక్విడిటీ, నిర్వహణ అవసరాల కోసం మిగతా 5 శాతాన్ని డెట్ లేదా మనీ మార్కెట్ సాధనాలకు కేటాయించవచ్చు. దేశీయంగా బంగారం ధరలను ఇది ప్రామాణికంగా ట్రాక్ చేస్తుంది. ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటుగా ఉండేలా ఈ ఈటీఎఫ్‌లో ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.

“భారతీయ ఇన్వెస్టర్లకు బంగారం ఎప్పుడూ ఒక కీలకమైన పెట్టుబడి సాధనంగా ఉంటోంది. బంగారంలో నిరాటకంగా, పారదర్శకంగా, సమర్ధవంతంగా పెట్టుబడి పెట్టే మార్గంగా 360 వన్ గోల్డ్ ఈటీఎఫ్ ఉపయోగపడుతుంది. వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో వినూత్నమైన, ఇన్వెస్టర్లకు అనుకూలమైన సొల్యూషన్స్ అందించాలన్న మా సిద్ధాంతానికి అనుగుణంగా ఈ ఈటీఎఫ్ ఉంటుంది” అని 360 వన్ అసెట్ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు.

“పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో చారిత్రకంగా బంగారం కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. లిక్విడిటీ, తక్కువ ఖర్చుల ప్రయోజనాలను అందిస్తూనే బంగారం ధరలను నిశితంగా ట్రాక్ చేసే విధంగా మా గోల్డ్ ఈటీఎఫ్ రూపొందించబడింది. దీర్ఘకాలికంగా పసిడిలో పెట్టుబడుల ద్వారా ప్రయోజనాలను పొందగోరే ఇన్వెస్టర్లకు ఇదొక విలువైన సాధనం కాగలదని మేము విశ్వసిస్తున్నాం” అని 360 వన్ అసెట్ ఫండ్ మేనేజర్ రాహుల్ ఖేతావత్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News