సజ్జన్ జిందాల్ కు 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్' అవార్డు
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌కు 15వ ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) మేనేజింగ్ ఇండియా అవార్డులలో ప్రతిష్టాత్మకమైన 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్' అవార్డుతో సత్కరించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జతిన్ ప్రసాద్‌ల చేతుల మీదుగా ప్రదానం చేశారు. జిందాల్ నాయకత్వంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆదాయం కంటే ఎక్కువగా 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆ సంస్థ వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం సుమారు మూడు పెరిగి 39 మిలియన్ టన్నులకు చేరుకున్నది. ఆయన వ్యూహాత్మక నిర్ణయాల ద్వారా జేఎస్‌డబ్ల్యూ పునరుత్పాదక ఇంధనం, సిమెంట్ తయారీ, మౌలిక సదుపాయాలలో ప్రధాన పాత్రధారిగా నిలిచింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సహకారంతో ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిక డ్రోన్‌లలోకి ప్రవేశించింది. కేపీఎంజీ ఇండియా సీఈవో యెజ్జి నాగ్‌పోర్ అన్నారు.
భారతతేశంలో వ్యాపార రంగం అభివృద్ధిలో విశేషంగా కృషి చేసిన వారికి ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మేజేజింగ్ ఇండియా అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది 15వ ఎడిషన్ నాయకత్వం, దేశ నిర్మాణంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడానికి పరిశ్రమల లీడర్లను, AIMA ఆఫీస్ బేరర్లను ఒక చోట చేర్చింది.