మార్కెట్లకు బ్లాక్‌ 'మండే'

మార్కెట్లు ఏకంగా 8 నెలల కనిష్టాలకు పడిపోగా.. ఈ ఒక్కరోజే సుమారు రూ. 4 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరి

Advertisement
Update:2025-02-24 16:46 IST

దేశీయ మార్కెట్లలో బేర్‌ పట్టు కొనసాగుతున్నది. ట్రంప్‌ టారిఫ్‌ భయాల నుంచి సూచీలు కోలుకోవడం లేదు. దీనికితోడు భౌగోళిక రాజకీయ పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు మార్కెట్లను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సోమవారం సెషన్‌లో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. మార్కెట్లు ఏకంగా 8 నెలల కనిష్టాలకు పడిపోగా.. ఈ ఒక్కరోజే సుమారు రూ. 4 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైంది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 850 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుంగింది.

అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం 74,893 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. ఒక దశలో 900 పాయింట్లకు పైగా దిగజారి 74,387 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 856.66 పాయింట్లు నష్టపోయి 74,454.41 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 242.55 పాయింట్లు పతనమై 22,553.35 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి 86.72 వద్ద స్థిరపడింది. ఆటో, ఫార్మా, ఎఫశ్రీఎంసీజీ మినహా దాదాపు అన్నిరంగాల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఐటీ, లోహ, టెలికం సూచీలు 2 శాతం మేర కుంగాయి. నిఫ్టీలో పిప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. మహింద్రా అండ్‌ మహింద్రా, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరో మోటార్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.

మార్కెట్‌ పతనానికి కారణాలు ఇవే

విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రూ. 3,449.15 కోట్ల మేర పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి మొత్తంలో రూ.23,740 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పటివకు ఎఫ్‌పీఐ అమ్మకాలు ఏకంగా రూ. లక్ష కోట్లు దాటడం విశేషం ఈ ప్రభావం సూచీలపై తీవ్రంగా పడింది.

Tags:    
Advertisement

Similar News