లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ప్రారంభంలో నష్టాలతో మొదలుపెట్టినా అనంతరం లాభాల్లోకి వచ్చిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 22,900 కింద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అయితే ఆ తర్వాత కోలుకుని లాభాలబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.90 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,946.10 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్ 305.62 పాయింట్ల లాభంతో 76273.01 వద్ద, నిఫ్టీ 80.55 పాయింట్లు పెరిగి 23025.85 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, టెక్‌మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి