కారు సబ్‌స్క్రిప్షన్ గురించి తెలుసా?

కారులో తిరగడం కోసం లక్షలు ఖర్చు పెట్టి కారు కొనాల్సిన పని లేదు. నెలవారీ చందా కింద సబ్‌స్క్రిప్షన్ మోడల్లో కూడా కారుని సొంతం చేసుకోవచ్చు.

Advertisement
Update:2023-10-30 17:30 IST

కారు సబ్‌స్క్రిప్షన్ గురించి తెలుసా?

కారులో తిరగడం కోసం లక్షలు ఖర్చు పెట్టి కారు కొనాల్సిన పని లేదు. నెలవారీ చందా కింద సబ్‌స్క్రిప్షన్ మోడల్లో కూడా కారుని సొంతం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు తెగ పాపులర్ అవుతోంది. దీని గురించి మీరూ తెలుసుకోండి మరి!

లక్షలు పెట్టి కొత్త కారు కొనకుండా లేదా కొంత పాడైన సెకండ్ హ్యాండ్ కారు వాడకుండా నెలకు కొంత సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీ చెల్లిస్తూ మంచి కారులో తిరగొచ్చు. అదే కారు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌. లోన్ తీసుకుని కారు కొన్నాక కొన్నాళ్లకు ఆ కారుపై మోజు తీరు కొత్త కారు కొనాలనిపిస్తుంది. దీనికితోడు మెయింటెనెన్స్ ఖర్చులు. తిరిగి అమ్మాలంటే రీ సేల్ వాల్యూ తగ్గిపోవడం.. ఇలాంటి ఇబ్బందులు లేకుండా నచ్చినప్పుడు మోడల్ మారుస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త కారులో తిరగాలనుకునేవారికి.. కారు సబ్‌స్క్రిప్షన్ మోడల్ బాగా సూట్అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా కారు కంపెనీలు కారు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ప్లాన్ కింద నచ్చిన కారును సెలక్ట్ చేసుకుని.. నెలవారీ చందా చెల్లిస్తూ కారు వాడుకోవచ్చు. కేవలం పెట్రోల్ ఖర్చులు భరిస్తే సరిపోతుంది. సెలక్ట్ చేసుకున్న టైం పీరియడ్ వరకూ కారుకు మీరే ఓనర్లు. మారుతీ సుజుకీ, మహీంద్రా, హ్యుందాయ్‌, ఎంజీ, టయోటా, నిస్సాన్‌ వంటి కంపెనీలు ఈ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను అందిస్తున్నాయి.

కారు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం కోసం డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు కొన్ని ఇన్‌కమ్ ప్రూఫ్ పత్రాలు సమర్పిస్తే చాలు. సంవత్సరం, రెండేళ్లు లేదా నాలుగేళ్ల వరకూ కారుని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ తరహా కార్లకు రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్‌, సర్వీసింగ్‌, రిజిస్ట్రేషన్‌, వారంటీ, రిపేర్లు వంటివన్నీ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. నచ్చిన కారును నచ్చినంత కాలానికి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు. మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే కారుని మార్చుకోవచ్చు.

కండిషన్స్ అప్లై

అయితే ఈ తరహా కార్లకు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీటికి కిలోమీటర్ల లిమిట్ ఉంటుంది. లిమిట్ కంటే ఎక్కువ కిలోమీటర్లు తిరిగితే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కారుకి స్టికర్స్, డిజైనింగ్ మార్పుల వంటివి కుదరదు.

ఇకపోతే సొంతకారు కొంటే చెల్లించాల్సిన ఈఎంఐ కంటే కొన్నిసార్లు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీనే ఎక్కువ ఉండొచ్చు. అది కారు మోడల్‌ను బట్టి డిసైడ్ అవుతుంది.

చివరిగా చెప్పేదేంటంటే కార్లంటే ఎక్కువ మోజు ఉన్నవాళ్లు, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌తో తిరగాలనుకునేవాళ్లకు ఇది అనువుగా ఉంటుంది. కారుని ఒక అవసరంగా భావించే వాళ్లు, ఎక్కువకాలం పాటు ఒకే కారుని ఉపయోగించేవాళ్లు సొంతకారు కొనుక్కోవడం బెటర్ అనేది నిపుణుల సలహా.

Tags:    
Advertisement

Similar News