నష్టాల్లో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

మొదట సూచీలు ప్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ.. ప్రధాన షేర్లలో మదుపర్లు విక్రయాలకు దిగడంతో నష్టాల్లోకి వెళ్లిన సూచీలు

Advertisement
Update:2025-02-11 10:12 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ప్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాల మధ్య మదుపర్లు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు కాస్త ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 23,350 పైన ట్రేడింగ్‌ మొదలుపెట్టగా.. సెన్సెక్స్‌ ప్లాట్‌గా ప్రారంభమైంది. మొదట సూచీలు ప్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ.. ప్రధాన షేర్లలో మదుపర్లు విక్రయాలకు దిగడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 87.35 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 76.05 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,950.80 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 272.90 పాయింట్ల నష్టంతో 77038.90 వద్ద.. నిఫ్టీ 71.15 పాయింట్లు తగ్గి 23310.45 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News