Bajaj 2901 Chetak | భారత్ మార్కెట్‌లోకి బజాజ్ 290 చేతక్.. రూ.95,998లకే లభ్యం..!
Bajaj 2901 Chetak | బజాజ్ ఆటో తిరిగి భారత్ మార్కెట్‌లోకి ప్రజలకు అందుబాటులో ధరలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దానికి బజాజ్ చేతక్ 2901 అని పేరు పెట్టింది. దీని ధర రూ.95,998 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది.
Bajaj 2901 Chetak | బజాజ్ ఆటో తిరిగి భారత్ మార్కెట్‌లోకి ప్రజలకు అందుబాటులో ధరలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దానికి బజాజ్ చేతక్ 2901 అని పేరు పెట్టింది. దీని ధర రూ.95,998 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. యువతను లక్ష్యంగా చేసుకుని అత్యంత చౌక ట్రిమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ `చేతక్ 2901`గా ఆవిష్కరించింది. ఐదు కొత్త రంగుల్లో రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బజాజ్ చేతక్ 2901 ఈవీ స్కూటర్‌లో ఫీచర్లన్నీ పూర్తి మెటల్ బాడీతో రూపొందించారు. ఆన్‌లైన్‌లో బజాజ్ ఆటో అధికారిక వెబ్‌సైట్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి బజాజ్ ఆటో డీలర్ల వద్ద బజాజ్ 2901 చేతక్ ఈవీ స్కూటర్లు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
బజాజ్ 2901 చేతక్ ఈవీ స్కూటర్.. టూ టోన్ సీట్, బాడీ కలర్డ్ రేర్ వ్యూ మిర్రర్స్, సాటిన్ బ్లాక్ గ్రాబ్ రెయిల్, హెడ్ ల్యాంప్ కేసింగ్ కోసం మ్యాచింగ్ పిల్లాన్ ఫుట్ రెస్ట్ కాస్టింగ్, డిస్క్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్, ఎల్ఐడీ లైటింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, మెటల్ బాడీ ప్యానెల్స్, ఐపీ67 వాటర్ ఫ్రూఫింగ్ వంటి ఫీచర్లు జత కలిశాయి. ఓలా ఎస్1ఎక్స్, ఎథేర్ రిజ్టా ఎస్, టీవీఎస్ ఐ-క్యూబ్ (2.2 కిలోవాట్లు), విదా వీ1+.ఈవీ స్కూటర్లతో బజాజ్ 2901 చేతక్ పోటీ పడుతుంది.
బజాజ్ 2901 చేతక్ ఈవీ స్కూటర్ బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 123 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. బజాజ్ చేతక్ ఈవీ అర్బన్ వేరియంట్ కంటే బజాజ్ 2901 చేతక్ వేరియంట్ రూ.27,321, ప్రీమియం వేరియంట్ కంటే రూ.51,245 చౌక. బజాజ్ 2901 చేతక్ అర్బన్, ప్రీమియం వేరియంట్లతో పోలిస్తే బజాజ్ 2901 చేతక్ గంటకు 63 కి.మీ దూరం ప్రయాణం చేస్తుంది.
బజాజ్ 2901 చేతక్ 2.88 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 2.9 కిలోవాట్ల అర్బన్ వేరియంట్, 3.2 కిలోవాట్ల ప్రీమియం వేరియంట్ తో వస్తున్నది. ఈ బ్యాటరీ 100 శాతం చార్జింగ్ చేయడానికి ఆరు గంటల టైం పడుతుంది. 5- అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతోపాటు స్పోర్ట్స్ రైడింగ్ మోడ్, కలర్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎకానమీ రైడింగ్ మోడ్‌లోనూ లభిస్తుంది. అదనంగా రూ.3,000 ఖర్చు చేస్తే టెక్ ప్యాక్ ఫీచర్ కలిసి వస్తుంది. టెక్ ప్యాక్‌తో స్పోర్ట్స్ రైడింగ్ మోడ్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఫాలోమీ హోం లైట్ వంటి ఫీచర్లు ఉంటాయి.