ఇంకా ప్రజల వద్దే రూ.2 వేలు నోట్లు..ఎన్ని కోట్లు ఉన్నాయంటే?

దేశంలో ప్రజల నుంచి 98.18 శాతం రూ.2,000 వేల నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది.;

Advertisement
Update:2025-03-01 16:49 IST

దేశంలో ప్రజల నుంచి 98.18 శాతం రూ.2,000 వేల నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రూ.2వేల విలువైన కరెన్సీ నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 20 నెలల పైనే అయ్యింది. అయినా ఇంకా రూ.6400 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని తాజాగా ఆర్‌బీఐ పేర్కొన్నాది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82 శాతం రూ.6,471 కోట్ల విలువ చేసే రూ.2 వేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది.కాగా, బ్యాంకులద్వారా రూ.2 వేలు నోట్లను మార్చుకునే వెసులుబాటు 2023 అక్టోబరు 7వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తున్నారు.

ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడికి, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉందని... తమ కార్యాలయాల వద్దకు రాలేని వారు పోస్టల్ శాఖ ద్వారా కూడా నోట్లను పంపవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్‌ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను మార్పిడి/ డిపాజిట్‌ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. రీజనల్‌ ఆఫీసులకు చేరుకోలేనివారు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపుర్‌, జమ్మూ, కాన్పుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్‌, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News