వరుసగా మూడోరోజు తగ్గిన గోల్డ్‌ రేట్‌.. ఎంతంటే?

వరుసగా మూడో రోజు బంగారం రేటు గరిష్ఠంగా రూ. 540 తగ్గింది.;

Advertisement
Update:2025-02-28 12:31 IST

పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా మూడో రోజు బంగారం రేటు గరిష్ఠంగా రూ. 540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు గుడ్‌న్యూసే. శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..హైదరాబాద్‌, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన పసిడి ధర.. నేడు కూడా రూ. 440 (22 క్యారెట్స్‌ 10) రూ. 540 (24 క్యారెట్స్‌ 10 గ్రా) తగ్గింది. ఇవే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ కొనసాగుతాయి.

చెన్నైలోనూ బంగారం ధరలు వసరుగా రూ. 500, రూ. 540 తగ్గింది. దీంతో అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల ధర రూ. 86,840 వద్ద ఉన్నది. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో పసిడి ధరలు రూ. 79750 (10 గ్రా 22 క్యారెట్స్‌), రూ. 86,990 (10గ్రా 24 క్యారెట్స్‌) వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతేకాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. 

వెండి ధరలూ పతనం

పసిడి ధరల మాదిరిగానే వెండి ధరలూ పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు కేజీ సిల్వర్‌ ధర రూ. 1,05, 500 చేరింది. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగళూర, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 97,000 వద్ద ఉన్నది.

Gold and silver price on February 28

Tags:    
Advertisement

Similar News