నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాల మధ్య అప్రమత్తంగా వ్యవహరిస్తున్న మదుపర్లు

Advertisement
Update:2025-02-27 10:01 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 9.42 పాయింట్లు తగ్గి 74592.70 వద్ద.. నిఫ్టీ 6.05 పాయింట్లు కుంగి 22541.50 వద్ద ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 72.77 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,90.60 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇబడియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News