ప్యూర్ ఈవీని రెఫర్ చేస్తే రూ.4 వేల క్యాష్ బ్యాక్
పండుగల సందర్భంగా స్పెషల్ ఆఫర్ ప్రకటించిన సంస్థ
స్నేహితులు, కుటుంబ సభ్యులకు తమ ఈవీని రెఫర్ చేస్తే రూ.4 వేల క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్యూర్ ఈవీ సంస్థ ప్రకటించింది. ''ప్యూర్ పర్‌ఫెక్ట్ 10'' పేరుతో ఈ రిఫరల్ ప్రోగ్రాం లాంచ్ చేసింది. శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా మార్చి 31లోపు లేదా ఔట్ లెట్స్ లో ఈవీ స్టాక్స్ ఉన్నంత వరకు ఈ స్కీం వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ప్యూర్ ఈవీ వెహికిల్ కొనుగోలు చేసిన వాళ్లు, కొత్తగా వాహన కొన్నవాళ్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ (వాట్సప్ నంబర్) కు రిఫరల్ కోడ్ పంపుతారు. ఆ రిఫరల్ కోడ్ ఉపయోగించి కొత్త ఈవీ కొనుగోలు చేస్తే రూ.4 వేల క్యాష్ బ్యాక్ ఓచర్లు ఇస్తారు. పది మంది కష్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ ఓచర్లను భవిష్యత్‌లో సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. లేదా నేరుగా క్యాష్ డిస్కౌంట్ కూడా పొందవచ్చని సంస్థ వెల్లడించింది.