సృష్టిలో మానవుడు శారీరకం గాను మానసికంగా గాను ఆహ్లాదాన్ని కోరుకోవడం సహజం. భౌతిక
ఆనందాన్ని శరీరం కోరుకుంటే మానసికఆనందాన్ని మనసు కోరుకుంటుంది.
కళ అనేది దైవ దత్తం.
ప్రతి వ్యక్తి లోను సృజనాత్మకత దాగివుంటుంది.చతుష్షష్టి కళల్లో ఎన్నో కళా రూపాలు ఆయా వ్యక్తుల అభిరురుచి అనురక్తి, సాధన బట్టికళారంగంలో రాణి స్తారు.
ముఖ్యంగా సంగీతం, సాహిత్యం, చిత్రాలేఖనం, నృత్యం, జానపద, లలితకళ ల్లో ఆరితేరిన కళాకారులు, పండితులు, విధ్వాంసులు ఎందరో కళామతల్లి ఒడి లో సేద దీరి సేవలో తరించారు.
జనపదాల్లో శ్రమ జీవులు పగలంతా చెమటోడ్చి కష్టించి పనిచేస్తుంటారు.
సాయంత్రం కాగానే శారీరక శ్రమను మర్చిపోవడానికి వినోదం తోపాటు విజ్ఞానాన్ని కోరుకుంటారు.
పూర్వం పరిస్థి తులు గమనించి నట్లయితే జానపద కళల కు అధిక ప్రాధాన్యత యుండేది.
హరికధలు, పౌరాణిక, చారి త్రాత్మక నాటకాలు, తోలు బొమ్మలాట, జముకుల కధలు, యిలా ఎన్నెనో ప్రదర్శనలు ఉండేవి. మనసుకు ఆహ్లాదాన్ని వినోదాన్ని యిచ్చేవి.
వీటిల్లో బుర్రకధకు ఆరోజుల్లో ఎక్కువ ప్రాచుర్యం కలిగిన జాన పద కళా రూపం
బుర్రకధ :బుర్రకధ కళారూపం విశేషమైనది. ఒక ప్రత్యేకతను కలిగినది. బుర్రకధకు ఆద్యుడు నాజర్ అంటారు నాజర్ వల్ల ఈ కళారూపం జాతీయఅంతర్జాతయ రాష్ట్ర స్థాయి లోనూ, పల్లెటూళ్ళ లోనూ బహుళ ప్రసిద్ధి గాంచింది.అనేకమంది కళాకారులు తయారై ప్రదర్శనలు ఇచ్చే వారు.
బుర్రకథ లో ముగ్గురు కళాకారులుంటారు. ఒక ప్రధాన కథకునికి అనుగుణంగా సంగీత వాద్య కళాకారుల సహకారంతో ప్రదర్శన జరుగుతుంటుంది.
ప్రధాన కథకుడు చేతిలో తంబురా పట్టుకుని తలకు తురాయి టోపీ ధరించి,కుడి చేతి చిటెకనవ్రేలుకి రుమాలు కట్టుకుంటాడు.రాగ భావ యుక్తంగా కథను చెప్తుంటాడు. మిగిలిన ఇద్దరు వంత పలుకుతూ తందానతానా,సై అని అంటుంటారు
ఒకరు వచనం, మరొకరు హాస్యం, చమత్కారం జోడించి చెపుతూజనాన్ని నవ్విస్తూ ఆహ్లాద పరుస్తారు.తెల్ల వార్లుబుర్ర కధను రక్తి కట్టిస్తారు. ముఖ్యంగా పౌరాణిక ఘట్టాలు బాలనాగమ్మ, సారంగధర, బొబ్బిలియుద్ధం, రామాయణం, మహాభారత లోని సన్నివేశాలు, పల్నాటి యుద్ధం, ప్రహ్లాద చరిత్ర, బెంగాల్ కరువు చారిత్రకకధలను ప్రదర్శిస్తారు.
హార్మోనియం, తబలా వాద్యపరికరాలతో రసవత్తరంగా బుర్రకధల ప్రదర్శన ఉండేది.
"వినరా భారత వీరకుమారా, ""వందనం వందనము "అంటూ కధ ప్రారంభిస్తారు. వంతలు ఢక్కాలు పట్టుకుని సై సై, భళి భళి అంటుంటారు.
బుర్ర కధకు ఖండాం తర ఖ్యాతిని తీసుకొచ్చి నవారిలో, నాజర్, కుమ్మరి మాస్టారు, రాఘవమాస్టారు, చుక్క దాలినాయుడు, నిడదవోలు అచ్యుత రామయ్య, విస్సా ప్రసాద రావు, ప్రమీల సిస్టర్స్, చింతల కోటేశ్వరమ్మ, ఇలా ఎందరో బుర్రకధకువన్నె లద్ది న ప్రముఖులు రాణించారు.
అయితే నేడు బుర్ర కధలు చెప్పే వారే కరువయ్యారు. రోజులు మారాయి. తరం మారింది. కళారూపాలు కనుమరుగయ్యాయి. చూసే ప్రేక్షకులు కరువ య్యారు. కారణం నేటి వివిధ మాధ్యమాలతీవ్రమైన ప్రభావం ఫలితం. సినిమాలు, టీవీలు, వీడియోలు, ఆడియోలు అన్నీ అధిక ప్ర్రాచుర్యం సంతరించుకున్న నేపథ్యంలో జానపద కళారూపాలు అడుగంటి పోయాయి
ముఖ్యంగా బుర్రకధలు. దీనికి పూర్వవైభవం తీ సుకురావాలంటే ఇటు ప్రభుత్వం ,అటు ప్రజలపొత్సాహం ఎంతైనా అవసరం ఉంది
సంక్షేమ పధకాలపట్ల జనాలకు అవగాహన, సామాజికసమస్యలు విద్య, ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, రక్తదానం, మొదలగు విషయాలపై చక్కటి అవగాహనకు ఈ కళాప్రదర్శన ఎంతగానో ఉపయోగ పడుతుంది.
సమిష్టి గా అందరు హార్దికంగా, ఆర్ధికం గా తగిన ప్రోత్సాహాలు కల్పిస్తే బుర్రకధకళారూపానికి పూర్వవైభవం రావడం తధ్యం. వస్తుందని ఆశిద్దాం!ఆకాంక్షిద్దాం!!!
- డాక్టర్ కడలి ప్రకాశరావు