పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రకటన
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను శనివారం రాత్రి ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి ఈ అవార్డులను ప్రకటించింది. బ్రెజిల్ దేశానికి చెందిన వేదాంత గురువు బోనస్ మాశెట్టి, కువైట్ కు చెందిన యోగా గురువు అల్ సబాహ్, నేపాల్ కు చెందిన జానపద గాయకుడు నరేన్ గురుంగ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ అవార్డులను అందుకోనున్నారు.
పద్మ శ్రీ అవార్డు గ్రహీతలు వీరే.. జోనస్ మాశెట్టి (వేదాంత గురువు) - బ్రెజిల్, హర్వీందర్ సింగ్ (పారాలింపియన్) - హరియాణా, భీమ్ సింగ్ భవేష్ (సోషల్ వర్క్) - బిహార్, పి.దక్షిణామూర్తి (డోలు విద్వంసుడు)- పుదుచ్చేరి, ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం)- నాగాలాండ్, బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్. షేఖ ఏజే అల్ సబాహ్ (యోగా)- కువైట్, నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్, హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్, జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సోషల్ వర్కర్)- అరుణాచల్ ప్రదేశ్, విలాస్ దాంగ్రే (హోమియో డాక్టర్) - మహారాష్ట్ర, వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్నాటక, నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్, జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అసోం, సురేశ్ సోనీ (సోషల్‌వర్క్- పేదల డాక్టర్) - గుజరాత్, రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్, పాండి రామ్ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్‌గఢ్, లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్య్ర సమరయోధురాలు) - గోవా, గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్, సాల్లీ హోల్కర్ (చేనేత)- మధ్యప్రదేశ్, మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర, బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) - రాజస్థాన్, వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు, భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) - కర్నాటక, పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత)- గుజరాత్, విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్నాటక, చైత్రం దేవ్‌చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర, జగదీశ్ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్, నీర్జా భట్లా (గైనకాలజీ) - ఢిల్లీ, హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) ఉత్తరాఖండ్.