మా వారికి పెళ్లి (కథానిక)

Advertisement
Update:2022-11-01 12:00 IST

"ఏమేవ్! రేఖా, బాగున్నావా? నేను జ్ఞాపకంఉన్నానా?" అంటూ హడావుడిగా వచ్చిన ఆవిడను ఓసారి పరిశీలనగా చూసి, "ఆ, గుర్తొచ్చింది. నువ్వు సావిత్రక్కవు కదూ?ఇంటర్లో మా అక్క ఫ్రెండువి. ఎప్పుడో పాతిక సంవత్సరాలు క్రితం నీ పెళ్లిలో చూసాను. అందుకే గుర్తు పట్టలేకపోయాను" సంజాయిషీ ఇచ్చుకున్నాను.

"ఔను, నా పెళ్లి అయిపోగానే నేను వైజాగ్వదలి వెళ్లిపోయాను, ఇదిగో రెండేళ్ల క్రితమేఈయనకు ఈ హైదరాబాద్ బదలీ అయ్యింది.

ఔనూ, నువ్వు లాయర్ గానూ మీ ఆయన సైకియాట్రిస్టుగానూ ప్రాక్టీసు చేస్తున్నారుట కదా?

మీ అక్కయ్య చెప్పింది" సోఫాలో కూర్చునిఅడిగింది సావిత్రక్క

"ఔనక్కా ఏవో చిన్న చిన్న కేసులు" కాఫీఅందిస్తూ చెప్పాను.

కాసేపు ఏవో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడినతరువాత,

"రేఖా! మరి నే వెళ్తానే, నీతో కొంచెం పనిఉంటుంది. ఆ విషయాలు ఈసారి వచ్చినప్పుడుచెబుతాలే" అంటూ తన చిరునామా చెప్పి

బయలుదేరింది సావిత్రక్క

అన్నమాట ప్రకారం రెండు నెలల తర్వాతమా ఇంటికి వచ్చింది సావిత్రక్క వచ్చీరాగానే

"ఒసే అమ్మాయ్! మాంచి కాఫీ పెట్టవే,అలాగే విడాకులు తీసుకోవాలంటే ఏం చెయ్యాలో

అది కూడా చెప్పు" డైరెక్ట్ గా అడిగింది, సోఫాలోకూలబడుతూ.

ఆశ్చర్యపోయిన నేను, కాసేపటికి తేరుకుని,

"కాఫీ సంగతి సరే! విడాకులు ఎవరికి

అక్కా?" అడిగాను.

"ఎవరికో అయితే నేనెందుకు అడుగుతానే?మాకే. ఇంక ఆయనతో సంసారం చేయడంనా వల్ల కాదే! అందుకే నేనే విడాకులు ఇచ్చేద్దాం

అనుకుంటున్నా" మా పని అమ్మాయి ఇచ్చినకాఫీ తాగుతూ చెప్పింది సావిత్రక్క

సావిత్రక్క చిన్నప్పటి నుండి కూడా ఆదర్శభావాలతో ఉండేది. ఆమె తండ్రి, తల్లినీ తననూఅనాథలుగా వదిలేసి వెళ్లి పోయి, వేరే ఆవిడతో

ఉండడంతో తండ్రి మీద అసహ్యం పెంచుకుంది. దానికి తోడు ఆడవాళ్ల మీద మగవారిదౌష్ట్యాలు గురించి పేపర్లలో చూసి చూసి మగజాతి అంటేనే కక్ష పెంచుకుంది.

అయితే సావిత్రక్కకు డిగ్రీ అయిపోగానేఆమె మేనమామలు ఈమెను బలవంతానఒప్పించి సత్యారావుతో వివాహంజరిపించారు.

మరి ఇన్నేళ్లు కాపురం చేసిన తరువాత ఈ మనస్పర్థలు ఏమిటో? బావగారి మీద అంత ద్వేషం

ఎందుకో?"పరిపరివిధాల ఆలోచిస్తున్న నేను,

"ఏమిటే ఏమీ మాట్లాడవు? నువ్వు

విడాకుల స్పెషలిస్టు అంటే నీ వద్దకు

వచ్చా కానీ, లేక పోతే....." అన్న సావిత్రక్కమాటలతో ఈ లోకంలోకి వచ్చి,

"అబ్బే అదేం లేదక్కా! ఔనూ... అసలుబావగారితో నీకు ఏమిటి ప్రాబ్లమ్?" డైరెక్ట్ గాఅడిగాను, తాగిన కాఫీ గ్లాసు పక్కన పెడుతూ,

"ఈయనకు కూడా మా నాన్న లాగే వేరేఆవిడతో సంబంధం ఉంది. ఐదేళ్ల నుంచి సాగుతోంది ఈ వ్యవహారం. ఆవిడ పేరు జయంతి.

ఈయన ఆఫీసులోనే పనిచేస్తుంది. ఈ విషయమై ఆయనతో చాలాసార్లు గొడవపడ్డాను.

ఆయన ఏవో సాకులు చెప్పేవారు కానీ ఆవిడవద్దకు వెళ్లడం మానేవారు కాదు. ఆవిడ నుంచివేరు చేయడం కోసమే భగవంతుడు ఈయనను

ఆ వైజాగ్ నుంచి ఇక్కడికి బదిలీ చేయించాడుఅనుకున్నాను. కానీ ఏడాది తిరక్కుండానే ఆవిడ

కూడా బదిలీ మీద ఇక్కడికి వచ్చేసింది" గద్గదస్వరంతో చెప్పింది సావిత్రక్క

"పోనీ నువ్వే ఒకసారి ఆవిడతో డైరెక్ట్ గామాట్లాడలేక పోయావా అక్కా?" అనుమానంవచ్చి అడిగాను.

"మన బంగారం మంచిది కానప్పుడు ఎవరని ఏమి లాభం? అంతగా అవసరం అయితేఆమె తోటే ఈయన పెళ్లి జరిపించేస్తా. పాపం,

ఆవిడ అయినా సుఖపడుతుంది. అవన్నీ ఇప్పుడుఎందుకు కానీ, ఆ విడాకుల ఫార్మాలిటీస్ఏమిటో చెప్పవే?" అసహనంగా అడిగింది

సావిత్రక్క

"అక్కా నాకు ఓ అవకాశం ఇవ్వు. నీకు

తెలుసుగా,మా వారు శోభన్, సైకియాట్రిస్టు అని. ఓసారి బావగారిని తీసుకుని ఆయన క్లినిక్కు

వెళ్లు. ఆఖరుగా ఓ చిన్న ప్రయత్నం చేద్దాం!లేకపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచిద్దాం" ఆశగా చెప్పాను.

"ఏమిటోనే నీ చాదస్తం. సరే అలాగే చేద్దాం.నాకు అయితే ఆయన మారుతారని నమ్మకంలేదు. మరి నేను వెళ్తాను" సోఫాలోంచి లేస్తూ

చెప్పింది సావిత్రక్క

ఓ నాలుగు రోజులు భారంగా గడిచిన

తరువాత,

"ఏమండీ! ఈ రోజు సాయంత్రం సావిత్రక్కబావగారు మన క్లినిక్ కు వచ్చారట కదా?ఏమైనా ఫలితం ఉందా?"రాత్రి భోజనం చేస్తూ

అడిగాను మా అయన్ని,

"రేఖా! మీ సావిత్రక్క భర్త సత్యారావు

మటుకు చాలా క్లియర్‌గా ఉన్నారు. 'ఆ జయంతి చాలా మంచి మనిషని, ఆమె తన చిన్ననాటి స్నేహితుని భార్య అనీ, వాడు చనిపోవడంతో

ఆ కుటుంబం బాగోగులు తానే చూస్తున్నాననీ, అంతకు మించి ఏమీ లేదనీ' చెప్పాడు. మీఅక్క ఇవన్నీ విన్నది కానీ ఎటువంటి భావం

వ్యక్తం చేయలేదు. ఇంకో సారి కౌన్సిలింగ్ కు రమ్మని చెప్పాను. నాకు తెలిసి ఆమె మారడం అనేది సందేహమే!" అనుమానంగా చెప్పారు మా ఆయన.

పోన్లెండి, దాని కర్మ ఎలా ఉంటే అలాజరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి అంతే,మహా మొండి. సరే వదిలేయండి" సర్దిచెప్పాను

ఆయనకు.

"హలో... హలో... ఒసేయ్, రేఖా! నేనే,

సావిత్రక్కని మాట్లాడుతున్నా. ఎల్లుండి బుధవారం మా వారికి పెళ్లి, కరోనా మూలంగాఎక్కువ మందిని పిలవడం లేదు. ఊర్లో ఉన్నా

వని నిన్ను మాత్రం పిలుస్తున్నా" రెండు నెలలతరువాత సావిత్రక్క నుంచి వచ్చిన ఫోన్లోఆమె చెబుతున్న మాటలు వింటూ బిత్తరపోయిన

నేను, కాసేపటికి తేరుకుని,

"అక్కా! ఏమిటి నువ్వు చెప్పేది? అసలుఈ పెళ్లికి బావగారు ఒప్పుకున్నారా?" ఆశ్చర్య

పోతూ అడిగాను.

"అసలు పెళ్లి కుదిర్చిందే నేను అయితేఆయన ఎందుకు ఒప్పుకోరే? సంతోషంగాఒప్పుకున్నారు" చెప్పింది సావిత్రి.

"ఇంత కాలం ఎలాగూ ఉన్నావు కదా? మరికొన్నాళ్లు వెయిట్ చేసి ఉంటే బాగుండేది కదా

అక్కా" సలహా ఇవ్వబోయేను.

"ఇంకా ఎన్నాళ్లు భరిస్తామే! సరే, ఇచ్చినసలహాలు చాలు కానీ, నాకు ఇంకా చాలాపనులు ఉన్నాయి. నువ్వు, మరిది గారూ తప్ప

కుండా రండి. మీతో కొంచెం మాట్లాడే పనికూడా ఉంది. అడ్రసు నోట్ చేసుకో" సావిత్రక్కచెప్పిన అడ్రసు నోట్ చేసుకున్నాను.

"ఏమండీ, మా సావిత్రక్క అన్నంత పనీచేసింది" సాయంత్రం ఇంటికి వచ్చిన మాఆయనకు ఫోన్ సంభాషణ అంతా చెప్పాను.

"ఔనా? ఆయనకు పెళ్లి చేస్తోంది, సరే! మరిఈవిడ ఏం చేస్తుందట? ఆ తరువాత తనకునచ్చినవాడిని చేసుకుంటుందా?" కోపంగా

అన్నాడు శోభన్.

"అలా చెయ్యదు లెండి.

దానికి మగవాళ్లంటేద్వేషం కదా? బహుశా ఈయనకు విడాకులు

ఇచ్చేస్తుంది... అంతే" చెబుతూ ఆ సంభాషణకుముగింపు పలికాను.

ఆ రోజు శోభనుకు ఖాళీలేకపోవడంతో

నేను ఒక్కదాన్నే సావిత్రక్క చెప్పిన మినీ కళ్యాణమండపానికి చేరుకున్నాను. జనం పలచగా

ఉన్నారు.లోపలికి వెళ్లగానే హాల్ లోనే ఎదురయ్యారుసత్యారావు బావగారు. పట్టుపంచె, పట్టు

కండువా వేసుకుని కొత్త పెళ్లికొడుకు గెటప్లో మెరిసిపోతున్నారు. అక్కకు ఎలాగూ బుద్ధి లేదు,

ఈ పెళ్లి చేసుకోవడానికి ఈయనకేనా సిగ్గుఉండాలి కదా? అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను.

"రావే, ఏంటీ మా మరిది గారు రాలేదా?పోనీలే, నువ్వయినా వచ్చావు" ఎదురొచ్చినసావిత్రక్క అడిగింది.

"ఆయన ఏదో కౌన్సిలింగ్ లో బిజీ. ముందుపెళ్లి కూతుర్ని చూపించక్కా" కుతూహలంగాఅడిగాను.

"సరే చూపిస్తాను రా" అంటూ నన్ను లోపలికి తీసుకుని వెళ్లింది.

అక్కతో పాటు పెళ్లి కూతురి గదిలోకి వెళ్లిననాతో,"రేఖా! అన్నట్లు, ఇంతకు ముందు నువ్వుచూడలేదు కదూ, ఇదిగోనే ఇదే మా ఏకైక కుమార్తె వారిజ. ముద్దుగా వారి అని పిలుస్తాం"పెళ్లి కూతుర్ని చూపిస్తూ చెప్పింది సావిత్రక్క

"మా వారికి పెళ్లి అంటే అర్థం ఇదా?"

అని వెర్రి మొహం వేసుకుని పెళ్లి కూతురువైపు చూస్తున్న నాతో

"ఇదిగోనే రేఖా! నాకు దేవుడిచ్చిన ఆడపడుచు. నీకు చెప్పాను కదా, మా వారి కొలీగ్ జయంతి అని.. ఈవిడే!" అంటూ పెళ్లి కూతురు పక్కన కూర్చుని ఏవో సర్దుతున్న జయంతి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూచెప్పింది.

"ఏవండోయ్ శ్రీవారూ! పట్టుబట్టలు కట్టుకుని టింగురంగా అంటూ అక్కడ నిలబడడంకాదు. అలా మగపెళ్లివారి గదిలోకి వెళ్లి ఏం కొనాలో కనుక్కుని త్వరగా రండి, మనిద్దరంమన వారి చేత గౌరీపూజ చేయించాలిట."

"ఇదిగో జయంతి, నువ్వు కూడా మీ అన్నయ్యగారి వెనకాల పెళ్లి వారి గదికి వెళ్లి,ఏర్పాట్లు ఎలా ఉన్నాయో.

అడిగిరామ్మా!"ఈ మాటలు వింటూ బిత్తరపోయిన నాతో, "మీ ఆయన కూడా వస్తే బాగుండేదే. చెప్పకపోవడమే,అతను ఇచ్చిన కౌన్సెలింగ్, నాలోచాలా మార్పు తెచ్చింది. అందుకే అంటా రేమో శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని. లేకపోతే నేనేంటి? ఇలా............

కౌన్సెలింగ్ గురించి మా సావిత్రక్క ఇంకాఏదో మాట్లాడుతూనే ఉంది.

ఈ ఊహించని పరిణామం వలన చెమటలుపట్టడంతో, రుమాలు కోసం హాండ్ బాగ్ లోచెయ్యి పెట్టిన నాకు , అందులో ఉన్న సావిత్రక్కకోరిక మేరకు రెడీ చేసి తెచ్చిన విడాకుల కాగితాలు, ఇంక మా అవసరం ఏమిటనట్టు ప్రశ్నించాయి.


-బుద్ధవరపు కామేశ్వరరావు

Tags:    
Advertisement

Similar News