తెలంగాణ భవన్‌లో సంత్ సేవాలాల్ జయంతి
భోగ్ భండార్ సమర్పించిన బంజారా నాయకులు
Advertisement
మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను శనివారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో పలువురు లంబాడా నాయకులు సేవాలాల్ మహరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. బంజారా సంప్రదాయం ప్రకారం భోగ్ భండార్ సమర్పించి పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా చల్లగా ఉండాలని, కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరుకున్నారు.
Advertisement