1: ప్రశ్న నుండి పుట్టు అపరిమిత జ్ఞానంబు !
ప్రశలోనే బ్రహ్మాండంబు దాగియుండు !
ప్రశ్ననెరుగని జీవితం ప్రశ్నార్థకంబురా !
తెలియ వినగలేర తెలుగు బాల...!
2: ప్రశ్నతోనె పుట్టి పరమాత్మ బోధన !
ప్రశ్నతోడనె ముగిసె కురుసంగ్రామమ్ము !
ప్రశలతోనె కుమిలె కురు పితామహుడు!
తెలియ వినగ లేర తెలుగు బాల !
3: ప్రశలతోనె గడిచె శ్రీరామాయణమ్ము !
ప్రశ్నలే నిండుగా పంచమ వేదమ్ము !
ప్రశ్న ప్రశ్నలు పరమ భాగవతమ్ములో!
తెలియ వినగ లేర తెలుగు బాల !
4: ప్రశ్నార్థకమయ్యె పరమ ద్రోణుని చావు !
ప్రశ్నార్ధకముగ సాగె ధర్మజ జీవితమ్ము!
ప్రశార్థకమైతోచె పరమ పావని పాంచాలి !
తెలియ వినగ లేర తెలుగు బాల !
5: ప్రశ్నలేమిగిలె పంచ పాండవు మదిలోన !
ప్రశ్నార్థకమయ్యే కుంతి జీవితమ్మురా !
ప్రశ్నల తరంగాలే గాంధారి బ్రతుకంత !
తెలియ వినగ లేర తెలుగు బాల !
6 ప్రశ్న నుండి పుట్టి పరమాత్మ వచనమ్ము!
ప్రశ్ననుండి వచ్చే పరమ సహస్రమ్ము!
ప్రశ్నలోనె విదుర నీతి యున్నదిరా !
తెలియ వినగ లేర తెలుగు బాల !
7: ప్రశ్నలోనే గడిచె అంధుని జీవితము !
ప్రశ్నార్థకమాయె ఆ సుయోధన బ్రతుకు !
ప్రశ్న, ప్రశ్నగా మిగిలె కర్ణుని మదిలోన !
తెలియ వినగ లేర తెలుగు బాల !
8: ప్రశ్నలేసి సొలసె సుమిత్రా నందనుడు !
ప్రశ్నలేయ పడియుండె కైక తనయుండు !
ప్రశ్నలేల సుడిగుండాలాయె కౌసల్యా సుతునకు !
తెలియ వినగ లేర తెలుగు బాల !
9: ప్రశ్నల పరంపలే మిగిలె లంకాధిపతికి !
ప్రశ్నలతో ఓదార్చె సోదరుని విభీషణుడు !
ప్రశ్నార్థకమాయెగా పరమ పావని సీత !
తెలియ వినగ లేర తెలుగు బాల !
10: ప్రశ్నతోడసాగె పవన తనయుని జీవితం !
ప్రశ్నలేసి ఓదార్చే త్రిజట సీతమ్మను !
ప్రశ్నావళిగా మారెనా లంకా రాణి జీవితం!
తెలియ వినగ లేర తెలుగు బాల !
11: పరమ భాగవతము ప్రశ్నల పరంపరేగా !
రామాయణ మింకనూ ప్రశ్నార్ధకమయ్యే !
ప్రశ్నలుదయించే మదిలొన భగవద్గీతనే చదువంగ
తెలియ వినగ లేర తెలుగు బాల !
12: రెండు గోవుల ప్రశ్న మరణ మృదంగ మయ్యె !
ప్రశ్నగా మారెనా అయిదూళ్ళ మాట !
ప్రశ్నలే మిగిలెనా, పరమాత్మ తెలియక !
తెలియ వినగ లేర తెలుగు బాల !
13: ఇన్ని ప్రశ్నలకు సమాధానమ్ము నీయంగ!
కృష్ణ పరమాత్మ విశ్వరూపుడై నిలిచెగా !
వ్యాస, వాల్మీకులే మన ప్రశ్నల కాదర్శమ్మురా !
తెలియ వినగ లేర తెలుగు బాల !
14: భారత, రామాయణ, భగవద్గీతలే చదువంగ !
మదిలోని ప్రశ్నలకు మంచి సమాధానమ్ము దొరుకు !
ప్రశ్నలడుగుటయే పరమ సద్గుణమ్మురా !
తెలియ వినగ లేర తెలుగు బాల !
- తిప్పరాజు గోపాలరావు
( శ్రీవత్సాంకితం)