కాలంవల్లే లాభనష్టాలు,సుఖదుఃఖాలు, కామ క్రోధాలు, వృద్ధిక్షయాలు, జననమరణాలు,బంధమోక్షాలు, ఇలా అన్నీ కూడా జరుగుతున్నాయి.
కాలమహిమ తెలిసినవాడు కాలానికి లోబడిదుఃఖించవలసి వచ్చినా, దుఃఖించడు.
కష్టాలనుంచి బయటపడటానికి శోకం (ఏకొంచెంకూడ) సహాయపడదు!!! శోకించేవాడిశోకం బాధలను పోగొట్టదు. పైగా అది శోకించేవాడి శక్తిని నాశనం చేస్తుంది.
కాలం అనాది,సనాతనం, ధర్మస్వరూపం. అది సకల ప్రాణుల పై సమదృష్టి కలిగి ఉంటుంది.
దానికి పరిహారం కానీ, దానిని దాటటం కానీ,వీలులేదు.
వడ్డీవ్యాపారం చేసేవాడు వడ్డీని లెక్క గట్టినట్లుగా కాలం నిమిషాలను, సెకండ్లనూకూడా లెక్కగట్టి పీడిస్తుంది. “
“నేనీ పనిలో సగం ఈ రోజు మాత్రమే చేస్తాను. మిగిలింది రేపుచేస్తాను" అంటే కాలం ఆగదు. కాలపు నడకను గ్రహించటంవల్ల మనశ్శాంతి లభిస్తుంది.
(అంతే కాకుండా అది) మనస్సుకు 'తానుఆత్మనే కానీ శరీరం కాదు' అనే ఆత్మమయత్వభావనను అందిస్తుంది. ఆ భావనను అందుకున్నమానవుడు క్షోభకు అతీతుడైపోతాడు.
స్థితప్రజ్ఞుడిలా జీవించటానికి నాలుగు లక్షణాలున్నాయి.
1. రకరకాలు కష్టాలు వచ్చి మీదపడినాకూడా అతడు డీలాపడిపోడు.
2. అతడుసుఖాలను కోరుకోడు.
3. అతడికి దేనిమీదాఅత్యాసక్తిగానీ, దేనివల్లా భయంగానీ, ఎవరిమీద
కోపంగానీ ఉండవు.
4. అతడి మనస్సు నిత్యమూ పరతత్యాన్నిమననంచేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను అలవర్చుకున్న మానవుడు జీవితంలో ఎదురయ్యే
ఆటుపోటులను, సుఖదుఃఖాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు.
- స్వాతి