నిద్రరాని రాత్రులు కొన్నుంటాయి
2
ఫస్ట్ హ్యాండ్ పుస్తకం
సెకండ్ హ్యాండ్ పుస్తకంలా
సెకండ్ హ్యాండ్ మనుషులుంటారా
హ్యాండ్ మారుతున్న కొద్దీ పాతబడడం ,
రంగు మారడం , శిథిలమౌతుండడుం
పుస్తకమైనా, మనిషైనా
ముతక వాసనతో
మసక బారుతుండడం
ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఔతుందో లేదో తెలియదుగాని
ఓల్డ్ గోల్డ్ మాత్రం ఎప్పుడూ విలువతో భాసించే
ఒక పురాస్మృతే
నిజానికి చాలా వస్తువులూ..
చాలా మంది మనుషులూ
చాలా చేతులుమారుతూనే ఉంటారు
ఉద్యోగరీత్యానో,
వ్యవహార రీత్యానో,
తత్వ రీత్యానో
ఇష్టా ఇష్టాల మైకం లోనో.
అప్పుడు మనిషి
సగం తెరిచిందో..
సగం మూసుందో తెలియని తలుపౌతాడు
అప్పుడు పక్కనే ఉండవలసిన మనిషివి
నువ్వు .. లోపలికి.. ఆత్మలోకి
ఇంకిపోతుంటావు
అప్పుడే నువ్వు ఒకఅసఫల
స్వప్నానివై
కలగామారి అప్పుడప్పు డు
ఒక నిద్రరాని రాత్రి వౌతావు
3
రైలు ఇటునుండి వస్తుందో.. అటునుండి వస్తుందో తెలియదు విషయాలు చిన్నవే..కానితెలియవు
ప్లాట్ ఫారం పై నిలబడి
చూస్తున్నపుడు
నువ్వు అనాదిలోనుండి..
అనంతం లోనుండి..
అగమ్యంలో నుండి
నడచి వస్తుండడం తెలుస్తుంటుంది
ఎదుట ఒక ముళ్ళు లేని
డిజిటైజ్డ్ గడియారం
ఒక పొగమంచుని కప్పుకున్న
శీతాకాల ఉదయం
దూరంగా ఒక మసకదారి రూపుదిద్దుకుంటుండగా
దారి కేవలం పోవడానికే కాదు.. రావడానిక్కూడా కదా
అని తెలుసుకుంటూ
దారి గురించిన అన్వేషణ స్పృహ కలుగగానే
ఆత్మ నిప్పంటుకున్న కాగితమై
మళ్ళీ మనిషి ఒక నిద్రరాని రాత్రతౌడు
4
ఎప్పటికైనా పూవు రాలిపోతుందని తెలుస్తూoటుంది కదా
అప్పుడు
అంతఃచేతనలోకి ఒక తెగిన
బొక్కెనలా జారిపోతుంటావు నువ్వు
అంతా చీకటి.. వెలుగు..
అర్థ సుషుప్తి
దూరంగా చాచిన
రెండు చేతులు స్పష్టంగా ఎవరివవి.. ఎవరికోసం ..?