స్మరణీయపాత్రికేయులు ప్రసాద్

Advertisement
Update:2023-11-07 11:49 IST

ప్రముఖ పాత్రికేయులు,చారిత్రాత్మక రచయిత శ్రీ పాలపర్తి ప్రసాద్ వర్ధంతి నేడు 7 నవంబర్ .

బాపట్ల గుంటూరు జిల్లా వాస్తవ్యులైన ప్రసాద్ తల్లి తండ్రులు పాలపర్తి కృష్ణమూర్తి,తామ్రపర్ణి .

వీరి విద్యాభాసం అంతా అప్పటి మద్రాస్ లో జరిగింది.వీరు పాత్రికేయులుగా ఆంధ్ర పత్రిక ఎడిటర్ గా ఉద్యోగం చేసి పదవి విరమణ అనంతరం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

వీరి కలం నుండి అనేక చారిత్రక నవలలు వెలువడ్డాయి.వాటిలో కొన్ని రోషనారా,అక్బర్,ఆర్యచాణక్య, పృథ్విరాజ్,షాజహాన్ వంటి నవలలు వారి కలం నుండి ప్రసాద్ పేరుతో

అనేకరచనలు జాలువారాయి . ఆయన ప్రసాద్ పేరుతోనే సాహిత్య రంగం లో పేరు గడించారు.

సాహిత్యంపట్ల వారి అభిరుచి మాటల్లో చెప్పలేనిది.వీరికి సినిమా రంగంలోనూ మంచి మిత్రులు ఉన్నారు.

వారు ఎప్పుడూ ప్రచారాలకు, పురస్కారాలకు దూరంగా ఉండేవారు. నడుస్తున్న నిఘంటువు.రాజకీయ విశ్లేషకులు.మితభాషి.ఒక మంచి రచయిత,పాత్రికేయుడు. ఈ రోజున వారిని స్మరించుకుంటూ నివాళులు.

పాలపర్తి సంధ్యారాణి.

Tags:    
Advertisement

Similar News