అన్నా అక్కా
చెల్లీ తమ్ముడు
భార్యా పిల్లలు బంధాలన్నీ
జలతారు పరదాల ముసుగులే
అవసరార్థం తొడుక్కున్న వలువలే
కీర్తి ప్రతిష్ట
గౌరవము నింద
పొగడ్త తిట్టు
మనం వేయు బూటకాల
ఘన నాటకాలే
అప్పటి కప్పుడు సంభవించు
ఉత్తి సంఘటనలే
కష్టం సుఖం
తీపీ చేదూ
వగరు పులుపు
ఏ రుచులు
కలకాలం నిలవవులే
ఎప్పటికప్పుడు
కరిగిపోవు కొవ్వొత్తులే
నీ చూపు నీ దృష్టి
ఎదుట వానికంటే
వేరయినప్పుడు
వాడిని నీ వైపు లాగాలని
ఎందుకింత వృధా ప్రయాసల
గుండె చప్పుడు
ఎవరో ఏదో చేశారని
ఎవరో ఏదో అన్నారని
మధన పడి మురికి పడి
నిలిచి పోవుటెందుకు
నీకు నీవుగా నీకై నీవుగా
సాగిపో ముందుకు
-శివలెంక ప్రసాదరావు (సాలూరు)
Advertisement