కాటుక కళ్ళు..(కవిత)

Advertisement
Update:2023-08-10 13:06 IST

కాటుక లేని

నా.... కళ్ళు

కలువ కళ్ళు కావు

మీనాక్షిని ....

అంతకన్నాకాదు !

కలలు రాని కళ్ళు ....

ఈ కనుల....

కనుపాపలు

తడిసే.....

కన్నీటి సంద్రంలో....

కాలానికి ఎదురీదే

పనిలో.....

కదల లేక....

చూస్తున్నాయి....

శూన్యం వైపు....

ఈ నిశీధి రాతిరిని....

దాటి .....

రేపటి వెలుగుల

ఉదయం కోసం.....

ఎప్పుడెప్పుడాఅని

ఎదురుచూస్తున్నాయి..

నా కళ్ళు...!!

-సరళ శ్రీ లిఖిత ( లిక్కి )

Tags:    
Advertisement

Similar News