వివిధ కవుల సప్తపదులు
అహంకారం
మమకారం
సత్యాగ్నిలో దగ్ధమయితే కలుగును ఆత్మ -సాక్షాత్కారం
-వి శ్రీనివాస మూర్తి
(హైదరాబాద్ )
నిన్ను
నన్ను
విడదీసే విద్వేషాల
వెన్నుపై - ఎగిరి తన్ను!
-ఎన్.ఆర్.తపస్వి
(చెన్నై )
మాట
పాట
బాగుంటేనే విజయవంతం అవుతుంది చలనచిత్రం ఆట.
-జి.రంగబాబు
(అనకాపల్లి)
కోపాలు
తాపాలు
దరిజేరనీకు,వాటి -దుష్ఫలితాలను తుడిచెయ్యలేవు -పశ్చాత్తాపాలు!
-బృందావన రావు
(అహ్మదాబాదు )
కానున్నది
రానున్నది
ముందుగా తెలిసినచో జీవితమున కుతూహలం ఏమున్నది?
-డి .చంద్రకళ
(మల్కాజిగిరి )
ఆశా
నిరాశా
జీవితం తూగుటుయ్యేల ఊపేవు
ఈశా పరమేశా !
-పట్నాల ఈశ్వరరావు,
(విజయనగరo )
కలం
హలం
మొరాయిస్తే సమాజానికి వస్తుంది పోయే కాలం
-కె.వి.ఎస్. యోగానంద్
(హైదరాబాద్)
పవనం
కవనం
ఆస్వాదించే జీవనం ప్రతి నిత్యమూ నందనవనం!
-శ్రీమతి భారతీకృష్ణ
(హైదరాబాద్)
కష్టం
నష్టం
నిభాయించుకుని నిలబడితేనే కలుగుతుంది బ్రతుకంటే ఇష్టం.
-క్రొవ్విడి వెంకట బలరామమూర్తి
(హైదరాబాద్)
ఇంట
వంట
లేనివాటిని సాధించగలిగితే పండిస్తారు విజయాల - పంట
-పొత్తూరి సుబ్బారావు
(హైదరాబాద్)
సృజనకర్త :సుధామ