సంస్కృతి

Advertisement
Update:2023-05-27 15:40 IST

"అమ్మా. నాకు కుంకుడు కాయలు తలకి వద్దు..షాంపు కావాలి."

మారాం చేస్తోంది శ్రావణి

"మాతల్లివిగా. ఈ రోజు పండగ కదా ఈ ఒక్క రోజు చేసుకో.. "బ్రతిమలాడింది సునంద.

"ఏమిటమ్మా ! నీ చాదస్తం గానీ..

కళ్ళ లోపడి కళ్ళు ఎర్రగా మండుతుంది తెలుసా.. "గునిసింది

"కళ్లలో పడిన మలినం పోతుంది లే.. "అమ్మమ్మ వచ్చి మందలించింది.

" శ్రావణి తల్లీ,నేనో మాట చెపుతా వింటావా!"

"ఏమిటి అమ్మమ్మా! చెప్పు" అంది శ్రావణి.

"మన పండుగల్లో చేసే ప్రతీ పనికి ఒకసైంటిఫిక్ రీసన్ ఉందితల్లీ.కుంకుడు కాయలు షాంపూ కంటే మంచిది. జుట్టు ఊడదు .పెరుగుతుంది .కంట్లో పడినా మంచిది ,కళ్ళు శుభ్రం అవుతాయి .

పెళ్లిళ్లులోనూ పండుగల్లోనూ   మామిడి తోరణాలు కట్టడం.. ఎందుకు అంటే పదిమంది చేరుతాము కాబట్టి మనం విడిచి పెట్టిన కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తుంది .

ఇంటిముందు ముగ్గు సూక్ష్మక్రిములకు.. పసుపురాసుకోవడం ఏంటిబయటిక్గా పనిచేస్తుంది.

కొత్త బట్టలుకి పసుపు పెట్టడం. బాడ్ వైబ్రేషన్ ఏమన్నా ఉంటే పోతుంది.

చెప్పులుతో  లోనికి రావద్దు అంటాం.. బయట ఎక్కెడెక్కడో తిరిగి సూక్ష్మ జీవులు. ..చెత్త.. చెప్పులు మోసుకొని వస్తాయి. అదంతా ఇంట్లో చేరుతుంది..

అంతెందుకు ఈ కాలం పిల్లలు బొట్టు పెట్టు కోరు.నుదుటిని బొట్టు నాడి కణాలని ప్రేరేపించడమే కాదు చూడగానే మనిషిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు బొట్టు గాజులు వేసుకోకపోవడం ఫేషన్ ఐపోయింది. పూర్వ కాలం కళ్ళకు కాటుక. కాళ్ళకి పసుపు పెట్టే వారు. ఇప్పుడు ఆ వాసనే ఎక్కడ లేదు.

నిరంతరం బిజీగా ఉంటాం కాబట్టి పండుగ పేరు చెప్పి. ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకోవడం... స్పెషల్ చేసుకోవడము అన్నవి నియమాలుగా పెట్టారు. రోజు చేయాలంటే కుదురుతుందా చెప్పు.. ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం ధూపం వేస్తాం. ఎందుకో తెలుసా? ఇంట్లో దోమలు సూక్షజీవులు  చేరకుండా ఉండడానికి..

మూడు రోజులు బయట ఉండమని అనేవారు పీరియడ్స్ టైంలో. ఎందుకో తెలుసా.. ?పూర్వ కాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తెల్లవారి నుంచి రాత్రి వరకు చాకిరీతో అలిసిపోయే వారు. ఆ మూడు రోజులు వారికి రెస్ట్ అన్న మాట. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం లేదనుకో.. కాబట్టి వేరుగా కూచోవటం అక్కరలేదు.. కుదరదు కూడా..

పెద్దలు చెప్పిన మాట పెరుగన్నం మూట అనేవారు అందుకే..  ఇవన్నీ పెద్దలు పెట్టిన నియమాలు.. పాటించే వారి సంఖ్య తగ్గి విమర్శ చేసే వారి సంఖ్య పెరిగింది.. ఈ ఛాందస భావాల వెనుక సైన్స్ ఉంది చదువు కున్న పిల్లలు మీరు అర్ధం చేసుకొని ఆచరించాలి.."

"సరే అమ్మమ్మా !.. నాకు అర్ధం అయింది.. "శ్రావణి బుద్ది గా తలూపింది.. నిజంగానే  పండగ వచ్చినట్లు అనిపించింది అమ్మమ్మ కి... 

⁃ రెడ్డి పద్మా వతి. (పార్వతీపురం)

Tags:    
Advertisement

Similar News