ప్రకృతి పిలుపు

Advertisement
Update:2023-09-01 13:58 IST

ప్రకృతి పలకరిస్తే

పచ్చని వెచ్చని ఊహలఊయల

ప్రకృతి వికృతి ఐతే

విలయాల విధ్వంసకాండ

జనజీవిత జాగృతిలో

కమనీయపు పిలుపు

వనజీవిత ఆకృతిలో

రమణీయపు మలుపు

పచ్చపచ్చని తరువుల

విరులు వెదజల్లే ప్రగతి

పరిమళాల పరవశాలు

పలకరించే ప్రకృతి

ధరణిమీద రగులుతున్న

కాలుష్యపు విలయం

పెరుగుతున్న వాహనాల రొద జబ్బులమయం

ఆకాశం చిల్లులు పడి

అరుస్తున్న వైనం

అంతులేని అంతంలేని

ప్రమాదాల నిలయం

కాలమెంత పరుగిడినా

కాలుష్యమెంత జతపడినా

ప్రకృతి కన్నెర్ర జేసి

ప్రమాద హెచ్చరికలు చేసినా

జనజీవిత జాగృతిలో

మార్పులేదు ఇసుమంత

జీవులన్నీ ఒక్కటై పాడాలి

చరమగీతం మనమంత

కాంక్రీట్ జంగిల్ లో

ఇరుకు గదుల సావాసం

ఆకాశహర్మ్యాల తోటి

విలాసాల విధ్వంసo

పచ్చని చెట్లు నరికి

పలకరించు దుర్గంధం

పరిమళాల తోట నుంచి

పారిపోవు చందం

రైతన్నకు చేయిచ్చి

పొలాలనన్ని ప్లాట్లుగా ఆడు

భవిష్యత్తు తరాలవారి పాట్లు

గ్రహపాట్లు చూడు

జనజీవితంలో ఇప్పటికైనా

జాగృతి లేకుంటే

మనిషికి మనిషికి సరిఐన

సయోధ్య లేకుంటే

భావితరాల వారసుల

మనుగడ ప్రశ్నర్ధకమే

భవిత చూపును

మునుముందు అరాచకమే 

-రెడ్డి పద్మావతి

(పార్వతీపురం)

Tags:    
Advertisement

Similar News