ఏకచక్ర సప్తాశ్వ రథారూఢా!
దినకరా! ప్రచండ మార్తాండా!
కస్యపాత్మజా! ఆదిత్యుడా!
రవితేజా జయహే! జయజయహే!
జగతికి వెలుగుల వేలుపువే
చైతన్యానికి ప్రతి రూపుడవే
ఇలలో ప్రత్యక్ష భగవానుడవే
రవితేజా జయహే! జయజయహే!
కొలిచే వారికి కొంగుబంగారమే
పాపుల పాలిట అగ్ని జ్వాలవే
ప్రత్యక్ష సాక్షివి లోక సంచారివే
రవితేజా జయహే! జయజయహే!
ప్రకృతికాంత పులకించు నీ రాకతో
కమలం వికసించు నీ కిరణాలతో
అనారోగ్యం దరిచేరదు నీ స్పర్శతో
రవితేజా జయహే! జయజయహే!
సకల లోకరక్షామణివి నీవేనయ్యా
తొలికిరణాలతో మము బ్రోవుమయ్యా
సప్తమి శుభవేళ మము దీవించవయ్యా
రవితేజా జయహే! జయజయహే!
- డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
Advertisement